ఇదంతా యూట్యూబ్ జమానా.. ఇక్కడంతా డిజిటిల్ మేనియా నడుస్తోంది.. పెద్ద పెద్ద కంపెనీలు.. డిజిటల్ రంగం వైపునకు దూసుకొచ్చేశారు. మరలా వచ్చేసిన వాళ్ల పరిస్థితి ఏంటి ? అసలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ మీద ఏయే దృశ్యాలు చూస్తున్నారు.. వాటిని ఎవరెవరు తయారు చేస్తున్నారు ?? సోకాల్డ్ యాంకర్లు రిపోర్టర్ల పరిస్థితి ఏంటి ? వాళ్లు చేస్తున్న వీడియోలను చూస్తున్నారా?? అంటే, పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించినవి చూస్తున్నారు. వాటిలో కూడా సుప్రసిద్ధ యాంకర్లు మంచి నెట్ వర్క్ ఉంటే కొంత వర్కవుట్ అవుతోంది.
అంటే ఏళ్ల తరబడి న్యూస్ ఫీల్డ్ లో నానుతూ.. ఒక రిథం తెలిసిన వారు ఓకే. ఇటు అటు కాని వాళ్లు.. ఇటు అటు కాని యూట్యూబ్ చానెళ్లలో చేరి చేసే యత్నాలేవీ ముందుకు సాగడం లేదు సరికదా? వీళ్లను నమ్మి.. లక్షలు ధారబోసిన వారంతా బావురుమంటున్నారు. ఇందుకు బోలెడు ఉదాహరణలు కంటి ముందే కనిపిస్తున్నాయ్. మరి ఇలాంటి వాళ్లంతా ఏం కావాలంటే.. సబ్ స్క్రైబర్స్ ఎందరున్నారో అన్నేసి రూపాయలను ఇంటూ చేసి అమ్మేసుకోవాలి.. ఎక్కడికెళ్లినా ఈ చానెల్ మేం నడపలేకున్నాం.. లక్షల్లో లాస్ వచ్చింది. ఏ రియల్ ఎస్టేట్ పెట్టుకున్నా బావుండేది.. ఇప్పుడెలా చేయాల్రా భగవంతుడా అని వాపోవడమే మిగిలింది.
నువ్వెంత గొప్ప నెట్ వర్క్ కలిగి ఉన్నా.. ఒక్కోసారి.. ఆయా వ్యక్తుల వ్యక్తిగత బ్రాండింగ్, ఇమేజ్ లేకుంటే కష్టమే. వారి వల్ల మాత్రమే ఆయా యూట్యూబ్ లు నడుస్తున్నాయ్.. లేకుంటే లేదు. మరీ ముఖ్యంగా కొందరు వ్యక్తిగతంగా యూట్యూబ్ లను పెట్టుకుని.. ఒక ట్రెండ్ సెట్ చేసుకుని ఎలాగోలా నడపటం కామనై పోయిందిపుడు. మీరు తెలిసీ తెలియక సోకాల్డ్ ప్రొఫెషనలిజంతో చేసే వార్తలేవీ జనానికి ఎక్కడం లేదు. ఇదేదో తెలియని వింత ఒకటి చెబుతుంటేనే చూస్తున్నారు జనం. ఒక్కో రకమైన అంశాన్ని తీసుకుని.. ఒక్కో విధమైన ఎక్స్ ప్రెషన్లు పెడుతూ ఎంటర్టైన్ చేస్తుంటే ఆ మాయలో పడి.. జనం చూసేలా ఒక ట్రెండ్ క్రియేటైందీ మధ్య.
ఇలాంటి వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయ్.. దీంతో భార్యా భర్తలు, ఫ్యామిలీ లేడీస్, ఇంకా బాయ్స్ అండ్ గాల్స్.. వీళ్లంతా తెరపైకి వచ్చేస్తూ.. ఒక రేంజ్ లో రెచ్చిపోతున్నారు. ఒక సాధారణ యాంకర్, యాంకరిణి ఏదో తెలిసీ తెలియని తనంతో చోటా మోటా చానెళ్లలో చేసే ఏ యాంకరింగ్ కమ్ రిపోర్టింగ్ కి జనం జై కొట్టడం మరచి పోయి చాలా కాలమే అయ్యింది. ఆయా చానెళ్లు విపరీతమైన ఆశా వాదంతో భవిష్యత్తులో ఏవైనా లాభాలొస్తాయేమో అన్న ఆలోచనతో నడపటం తప్ప.. మరెలాంటి యూజ్ ఉండటం లేదు.
యూట్యూబ్ అంటే మెయిన్ స్ట్రీమ్ లో చెప్పలేనిది చెప్పినపుడు మాత్రమే జనం చూస్తారు. లేదంటే లేదు. పాలబుగ్గలతో నూనూగు మీసాలతో ప్రపంచ ప్రఖ్యాత జర్నలిస్టులా పోజులు కొడుతూ చేసే రిపోర్టింగ్ ని చూడ్డానికి జనం సిద్దంగా లేరు. టిపికల్ ప్రజంటేషన్, రిస్కీ జాబ్ వర్క్, ఇప్పటి వరకూ ఎవ్వరికీ తెలియని వింత.. ఇలాంటివేవో కట్టి పడేసే దృశ్యాలను మాత్రమే చూడ్డానికి జనం బాగా అలవాటు పడ్డారు. కొందరు వెబ్ సీరీస్ లు చేసి రీళ్లు కాల్చుకుంటున్నారు. పాపం వీరి అవస్థ వర్ణనాతీతం. కారణం… అవి కూడా ఎవరూ ఏమంత గొప్ప ఆసక్తికరంగా చూడ్డం లేదు. అందుకంటూ ఒక లాంగ్వేజ్ ఉంటోంది. అందుకంటూ ఒక సైన్స్ ఉంటోంది. ఎవరికి పడితే వాళ్లకు వెబ్ సీరీస్ లు తీసే టాలెంట్ లేదు.. ఉన్నా దాన్ని సమర్ధవంతంగా తెరకెక్కించలేక పోతున్నారనే చెప్పాల్సి ఉంటోంది.
స్టోరీ టెల్లింగ్ ఒక ఆర్ట్. ఉదాహరణకు జైలర్, లాల్ సలాం.. రెండూ వెంట వెంటనే రిలీజైన రజనీకాంత్ సినిమాలు. వీటిలో జైలర్ 600 కోట్ల వసూళ్లకూ, లాల్ సలాం రిలీజైందో లేదో కూడా తెలీక పోవడానికి గల కారణం.. ఈ స్టోరీ టెల్లింగే. అది తెలీకుండా ఉప్పర సోది కొడితే చూసేవాళ్లెవరూ లేరిక్కడ. అలాగని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ మీద రాణించే వాళ్లు లేరా? అంటే ఉన్నారు. కానీ అది సాదా- సీదా బడ్జెట్ లో సాదా- సీదా నెట్ వర్క్ తో నడిపితే సాధ్యం కావడం లేదు. ఒక ప్రముఖ యూట్యూబ్\ డిజిటల్ చానెల్ ఇప్పుడెలా నడుస్తోందంటే.. అది వీళ్లెవరికీ జీతాలివ్వదు. అందులో పని చేసేవాళ్లు.. సొంతంగా స్టోరీ వెతుక్కుని సొంతంగా ఖర్చులు పెట్టుకుని.. సొంత చానెల్ ని నడుపుకుంటున్నట్టు నడుపుకుంటున్నారు.
ఎవరి కమీషన్లు వాళ్లవి. ఎవరి ఓన్ స్టోరీ మేకింగ్ వారిది. ఇందులో కంపెనీ కేవలం బ్రాండింగ్ ని అరువిస్తుందంతే. మిగిలినదంతా ఎవరూ ఎవరికీ వచ్చి నేర్పరు. కాకుంటే ఆ సంస్థ ఒక వేదికగా పని చేస్తుందంతే. కొన్నంటే కొన్ని చానెళ్లు నాన్ పొలిటికల్ గా యమ రాణిస్తుంటే.. కొన్ని రసవత్తర రాజకీయ కథనాలు, ఇంటర్వ్యూలను వండి వార్చుతూ ఒక మార్కెట్ ని ఏర్పటు చేసుకున్నాయి. వీళ్లనిపుడు ఇన్ ఫ్ల్యూయెన్సర్స్ అంటున్నారు. వీళ్లకు గత ఎన్నికలప్పటి మార్కెట్ గురించి తెలుసుకునే కొద్దీ రోమాంచితం అయిపోయింది. వీళ్లకు వ్లాగర్లు కూడా తోడయ్యారు.
వీళ్లు ఫుడ్ వ్లాగర్లా? టూరిస్టు వ్లాగర్లా?? అని చూడట్లా.. వాళ్లు ఫెమిలియరా కాదా? అని మాత్రమే చూస్తున్నారు. లేకుంటే ఒక ఫుడ్ వ్లాగర్ తో సుజనా చౌదరి వంటి వారు ఎగబడి ఇంటర్వ్యూలు ఇవ్వడమేంటి. ఇదే సుజనా మహా న్యూస్ ఓనర్.(ఇప్పుడు కూడానా? అని అడక్కండి) మరి ఆయన ఫుడ్ వ్లాగర్లతో వాకాల్సిన(నడవాల్సిన) అవసరం ఏమొచ్చిందంటే.. దటీజ్ పర్సానిఫికేషన్ అంటే.. ఆయా వ్యక్తులకు వచ్చిన ట్రేడ్ మార్క్ లేదా ట్రెండ్ సెట్టింగ్ కి ఏర్పడ్డ మార్కెట్ వాల్యూ అది. మూడు ముక్కల్లో చెబితే.. ఇకపై ఏ స్పాన్సర్ కూడా వాళ్లనూ వీళ్లను నమ్ముకుని యూ ట్యూబ్ చానెళ్లను పెట్టకండి. మీ చేతి చిలుం వదుల్చుకోకండి.
అయితే పర్సనల్ గా ఎవరైనా తమ తమ ఇంట్రస్ట్ కొద్దీ.. తాము ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఆయా విభాగాల్లో అందించగలం అనుకుంటే వారు ముందుకు రావచ్చు. ఇప్పుడు జనం దృష్టి కోణం మారింది. వారు వీడియోలను చూసే విధాయకం మారింది. అదెంత కచడా కచడా వీడియో అయినా.. అందులో సరుకుంటే చూస్తున్నారు. అంతే తప్ప.. అందరూ ఏడ్చారు కాబట్టి నేనూ ఏడ్వాలనే ఏడుపుతో ఈ ఏడుపుగొట్టు వ్యాపారంలోకి దిగకండి.. తర్వాత నష్టాలో నష్టాలో అని కన్నీరు కార్చకండి. ఇది నా ఉచిత సలహా!
కారణమేంటో తెలుసా ? వ్యవస్థ ఉండటం ముఖ్యం కాదు.. దాన్ని తన వ్యక్తిగత అవస్థగా తీసుకుని నడిపే వారుండాలి.. అలాంటి వారే లేకుండా.. స్వతహాగా ఆ గట్స్ లేకుండా.. దయ చేసి యూట్యూబ్ వ్యాపారంలోకి దిగకండి.. ఇక్కడంతా మడ్డి మడ్డిగా ఉంది.. వడ్డీకి తెచ్చుకుని, ఆస్తులమ్ముకుని పెద్ద పెద్ద బ్రాండింగులు క్రియేట్ చేసి బాగు పడిపోదామని కలలు కనకండి సంజే!!!