Chairman of Telangana Legislative Council Gutha Sukender Reddy Helped to Poor Girl Marriage, Gutha Venkat Reddy Trust, Telangana Covid News,
అనాధ అమ్మాయి వివాహ కార్యక్రమానికి పట్టువస్త్రాలు, ఆర్ధిక సహాయం అందించిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి మరోసారి తమ దయాగుణాన్ని చాటుకున్నారు. సుఖేందర్ రెడ్డి గారి తండ్రి గుత్తా వెంకట్ రెడ్డి గారి పేరుమీద గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరుపున ఇప్పటికే పలు సేవ కార్యక్రమాలను గుత్తా అమిత్ రెడ్డి నిర్వహించారు. తాజాగా మరో మంచి సేవ కార్యక్రమం నిర్వహించి అందరి మన్ననలు గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబం పొందింది.
వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా రామన్నపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన సంధ్య అనే అమ్మాయి అమ్మ నాన్న లేకపోవడంతో నల్గొండ పట్టణ శివారు చర్లపల్లిలోని స్నేహ అనాధ ఆశ్రమంలో పెరిగింది. ఆ అమ్మాయికి అన్ని వసతులు కల్పించి ఒక స్థాయికి తీసుకువచ్చిన అనాధాశ్రమ నిర్వాహకులకు ఆమెకి వివాహం జరిపించడం చాలా కష్టంగా మారింది. దీనితో వివాహ కార్యక్రమానికి సహాయం చేయాల్సిందిగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని అనాధ ఆశ్రమ నిర్వహకులు కలిశారు. వెంటనే స్పందించిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ అమ్మాయి వివాహ కార్యక్రమానికి అవసరం అయిన పట్టు వస్త్రాలు, బంగారు ఉంగరం, కొంత ఆర్ధిక సహాయం తన తండ్రి గారి పేరున ఉన్న గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరుపున అందజేస్తానని హామినిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో వివాహం జరుపుకున్న సంధ్య-స్వామి పెండ్లికి అవసరం అయిన పట్టు వస్త్రాలు, బంగారు ఉంగరం, కొంత నగదును గుత్తా సుఖేందర్ రెడ్డి గారి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి ఆయన కోడలు అఖిల రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు, స్నేహ అనాధ ఆశ్రమం నిర్వాహకులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.