Entertainment సినీ రంగం ఓ రంగుల పరిశ్రమ. ఇందులో పనిచేసిన ఎందరో నటీనటులు ముందు జాగ్రత్తతో అడుగులు వేసుకుంటూ వెళితే మరి కొందరు మాత్రం అనుకోని పరిస్థితులు ఎదురై దినస్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఇప్పటికే ఎందరో నటీనటులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోగా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించుకున్న పావలా శ్యామల కూడా ప్రస్తుతం దీనస్థితిలో జీవితాన్ని వెల్లడిస్తుంది..
తెరపై నవ్వులు పూయించిన నటి పావలా శ్యామల దాదాపు 350 కి పైగా సినిమాల్లో నటించడంతోపాటు ఉత్తమ నటిగా పురస్కారాలు కూడా అందుకుంది ఎన్నో విలక్షణ పాత్రలు పోషిస్తూ అందరు ప్రశంసలు అందుకున్న పావలా శ్యామల పరిస్థితి ప్రస్తుతం ఎంతో దీనంగా ఉంది..
గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతంలో ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పావలా శ్యామల నాటక రంగంలో తనకంటూ ఓ మంచి పేరును తెచ్చుకుంది ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు పొంది తెలుగు ప్రజల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అయితే ప్రస్తుతం పావలా శ్యామల పరిస్థితి ఇప్పుడు కరోనాకు ముందు…కరోనా తర్వాత అన్నట్లు ఉంది. మూడేళ్ల నుంచి ఆమె పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఆమె మంచానికే పరిమితమయ్యారు. కనీసం తినడానికి తిండి లేదు, చూసుకోవడానికి మనిషి కూడా లేడని వాపోయింది. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు తల్లీకూతురు. అయితే తమకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరని ఎవరిని సహాయం చేయొద్దు అంటూ తాను మాట్లాడలేదు అంటూ చెప్పుకొచ్చారు కనీసం మూవీ అసోసియేషన్ వాళ్ళైనా తమని ఎంతో కొంత పట్టించుకుంటే పరిస్థితి మరింత దిగజారకుండా ఉంటుందంటూ తమ బాధను వెల్లడించారు