Entertainment టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్న నటి ప్రగతి.. తల్లి పాత్రలకు మంచి ఫేమస్ అయ్యి పేరు సంపాదించుకుంది అయితే ఈమె ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఈమె పోస్ట్ చేసే వీడియోలకు ఎందరో అభిమానులు ఉన్నారు. అదే నేపద్యంలో కొన్నిసార్లు ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటూ వస్తున్నారు అయితే తాజాగా ఈమె పెళ్లి పైన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి..
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్న ప్రగతి చాలా కాలం క్రితమే భర్తతో విడిపోయారు.. పెళ్లి చేసుకుని చాలా తప్పు చేశాను అంటూ చెప్పకు వచ్చారు ప్రగతి.. అలాగే తనకు పెళ్లి చిన్న వయసులో జరిగిందని తెలిసి తెలియని వయసులో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ చెప్పకు వచ్చారు.. అలాగే ఒక తప్పుడు నిర్ణయం వలన ఏర్పడిన పరిస్థితుల నుండి బయటకు రావడం కూడా కష్టమే. హీరోయిన్ గా ఎదిగే రోజుల్లో నేను పెళ్లి చేసుకున్నాను. దాని వలన చాలా నష్టపోయాను అంటూ చెప్పకు వచ్చిన ప్రగతి తాజాగా రెండో పెళ్లి పైన స్పందించారు.. నా మెచ్యూరిటీకి మ్యాచ్ అయ్యే వ్యక్తి దొరకాలి. కొన్ని విషయాల్లో నేను చాలా కచ్చితంగా ఉంటాను. 20 ఏళ్ల వయసులో ఉంటే అడ్జస్ట్ అయ్యేదాన్నేమో కానీ… ఇప్పుడు కష్టం.. కానీ మంచి తోడు దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ తెలిపారు..
ప్రస్తుతం ఏమే తన కూతురితో హైదరాబాదులో ఒంటరిగానే ఉంటున్నారు అలాగే సినిమాల్లో నటిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు అలాగే తనకు ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బందిలో లేవని సమాజంలో ప్రతి విషయానికి భయపడాల్సిన అవసరం లేదంటూ ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉంటారు ప్రగతి..