Viral news ఈ రోజుల్లో ప్రతి విషయం కల్తీగానే మారిపోతుంది.. ఆహారం విషయంలో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తుంది.. అయితే ఆన్లైన్ విషయం లో ఇది కొన్నిసార్లు మరీ ఎక్కువగా కనిపిస్తుంది అలా అని నేరుగా రెస్టారెంట్లకు వెళ్లి తిన్నా కూడా లాభం లేక పోతుంది తాజాగా ఎలాంటి ఓ సంఘటన ఓ కష్టమర్ కు ఎదురయింది..
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టాలంటే కొన్నిసార్లు భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది ఎందుకంటే పాడైపోయిన చెడిపోయిన ఆహార పదార్థాలను కొన్ని రెస్టారెంట్లు ఇస్తున్నాయి అంతేకాకుండా శాకాహారులకు సైతం మంచి ఆహారాన్ని అందించడం లేదు తెలియని చోటుకు వెళ్లి ఆహారాన్ని ఆర్డర్ పెట్టాలంటే ఇంకా మరిన్ని సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.. తాజాగా ఇలాంటి ఓ సంఘటనే మధ్యప్రదేశ్ ఇండోర్లో చోటు చేసుకుంది.. అయితే ఇలాంటి ఆలోచనలతోనే ఒక వ్యక్తి రెస్టారెంట్ కి వెళ్లి తిందామని అనుకున్నాడు. వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాడు అయితే ఇది వచ్చి రాగానే ఆకలితో ఉన్న ఆయన గబగబా తిందామని అనుకుంటున్నాగా అందులో మాంసం దుమ్ములు కనిపించడంతో కంగుతిన్నాడు.. దీంతో సదరు వ్యక్తి ఆ విషయాన్ని రెస్టారెంట్ మేనేజర్ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లాడు దీంతో వాళ్ళు క్షమించమంటూ ప్రాధేయపడ్డారు అయితే అయినప్పటికీ ఈ విషయాన్ని వదిలేదో అంటూ ఆ వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.. దీంతో రెస్టారెంట్ యజమాని స్వప్నిల్ గుజరాతీపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని.. తదుపరి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసల్ సంపత్ ఉపాధ్యాయ తెలిపారు.