ఈనెల 31 వ తారీకున (ఎల్లుండి,బుధవారం) ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బీహార్ పర్యటన చేపట్టనున్నారు. అందులో భాగంగా.. బుధవారం ఉదయం హైదరాబాదు నుండి పాట్నా కు బయలుదేరి వెళ్లనున్నారు.
గతంలో ప్రకటించిన మేరకు, గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన 5 గురు బీహార్ కు చెందిన భారత సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు.
సైనిక కుటుంబాలతో పాటు..
ఇటీవలి, సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు సీఎం కెసిఆర్ ఆర్థిక సాయం అందజేయనున్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయనున్నారు.
అనంతరం.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆహ్వానం మేరకు, మధ్యాహ్నం లంచ్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.