Entertainment మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు దాదాపు పదివేల క్రితం వివాహమైంది అయితే అతనితోపాటు వివాహమైన పలువురు హీరోలు ఇప్పటికే పిల్లల్ని కానీ పెంచుతుండగా వీరు మాత్రం పిల్లల విషయంలో వెనకడుగు వేస్తూ వచ్చారు అయితే అది తమ వ్యక్తిగతమని ఈ విషయం ఎవరికీ సంబంధం లేదంటూ ఇప్పటికే పలమార్లు చెప్పుకుంటూ వచ్చారు ఉపాసన రాంచరణ్ అయితే మెగా అభిమానులు మాత్రం వీరు ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తారా అంటే ఇప్పటివరకు ఎదురుచూశారు అయితే తాజాగా వీరిద్దరూ పేరెంట్స్ కాబోతున్నారని విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు లుగా మారింది..
రామ్ చరణ్ ఉపాసన దంపతులు 2012 జూన్ 14న వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.. ఇరు కుటుంబాల సమక్షంలో వీరు పెళ్లి ఘనంగా జరిగింది. అయితే తాజాగా వీరిద్దరూ తమ మొదటి బిడ్డను ఆహ్వానించబోతున్నారని విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ వేదికగా తెలుపుతూ తన ఆనందాన్ని ప్రకటించారు..
“హనుమాన్ జి ఆశీర్వాదాలతో ఈ విషయాన్ని పంచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డలను ఆహ్వానిస్తున్నారు. చిరంజీవి సురేఖ, శోభన అనిల్ కామినేని.” అని పేర్కొన్నారు.. అయితే పెళ్లి అయిన దగ్గర్నుంచి ఎంతో అన్యోన్య జీవితాన్ని గడుపుతున్న ఈ దంపతులిద్దరూ పిల్లల కోసం ఎదురైనా ప్రశ్నలను పెద్దగా పట్టించుకోలేదు. తమకు తమ జీవితం వ్యక్తిగత ఆనందం ముఖ్యమని.. అలాగే ప్రతి ఒక్కరికి జీవితంలో కొన్ని ఆలోచనలు, సమస్యలు ఉంటాయని, వాటిని ఎదుర్కొని ముందుకు వెళుతూనే ఉంటామని ఎప్పటికప్పుడు చెప్పకు వచ్చారు ఉపాసన. అయితే తాజాగా ఈ ప్రకటనతో మెగా అభిమానుల్లో ఆనందం నెలకొంది..