Chiranjeevi – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఏపీలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్న భారీ ఫాలోయింగ్ ని ఓట్ల రూపంలో మార్చుకోలేకపోతున్నాడు పవన్. ఈ విషయంలో మాత్రం పవన్ సక్సెస్ అవ్వట్లేదు. గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్లా ఓడిపోయాడు. అనుకున్నంత ఓట్లు కూడా రాలేదు. జనసేన గెలిచిన ఒక్క సీట్ కూడా లేకుండా పోయింది. దీంతో పవన్ ఈ సారి మరింతగా జనాల్లోకి వెళ్లేందుకు ట్రై చేస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ దగ్గర ముఖ్యంగా క్యాడర్ లేదు. చెప్పుకోదగ్గ నాయకులు వేళ్ళ మీదే లెక్కపెట్టొచ్చు. ఇది కూడా జనసేన పార్టీకి మైనస్ అవుతుంది. ఇక ఇప్పటికే సినీ, టీవీ ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు అధికారికంగానే జనసేనలో జాయిన్ అయ్యి ప్రచారం చేస్తున్నారు. గతంలో మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీ పెట్టి తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు సినీ పెద్దగా సినీ సమస్యల గురించి మాట్లాడటానికి రాజకీయ నాయకులని కలుస్తున్నారు.
అయితే పవన్ అంటే చిరంజీవికి అమితమైన అభిమానం అని అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ని ఎవరన్నా ఏమన్న అంటే ఊరుకోరు. కానీ పవన్ రాజకీయాల్లోకి వెళ్ళాక విమర్శలు తప్పవు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. ఇన్నాళ్లు పవన్ రాజకీయాల గురించి ఎక్కువగా చిరంజీవి మాట్లాడలేదు. ఇండైరెక్ట్ గా కూడా సపోర్ట్ చేయలేదు. కానీ గత కొన్నాళ్లుగా మాత్రం చిరంజీవి ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నారు. చిరంజీవి మాత్రమే కాదు చిరంజీవి చుట్టూ ఉండే వాళ్ళు, మెగా ఫ్యామిలీ సన్నిహితులు, మెగా కాంపౌండ్ లో ఉండే ప్రముఖులంతా కూడా పవన్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఈ ఎలక్షన్స్ లో జనసేనాని ని ఎలాగైనా గెలిపించాలని చూస్తున్నారు.