‘సినిమా బండి’ 53వ అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవం (IFFI) ‘ఇండియన్ పనోరమా’లో ఎంపికై గౌరవాన్ని పొందింది. దర్శకుడు (ప్రవీణ్ కాండ్రేగుల), రచయితలు వసంత్ మరింగటి, కృష్ణ ప్రత్యూష, సంగీత దర్శకుడు, సినిమాటోగ్రఫీ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్లు.. అందరూ కొత్తవాళ్ళు కలిసి ‘సినిమా బండి’ని మనసుని హత్తుకునే చిత్రంగా రూపొందించారు.
ఈ చిత్రానికి రాజ్ & డికె మార్గదర్శకత్వం వహించారు. కొత్త ఫిల్మ్ మేకర్స్, ఇండిపెండెంట్ సినిమాకి మద్దతుగా వారి D2R ఇండీ బ్యానర్పై నిర్మించిన తొలి చిత్రమిది. రాజ్ & డికె.. ది ఫ్యామిలీ మ్యాన్, స్ట్రీ, షోర్ ఇన్ ది సిటీ, గో గోవా గాన్ లాంటి మరపురాని ప్రాజెక్ట్ల క్రియేటర్స్.
డజను మందికి మించని చిన్న టీంతో, నెట్ఫ్లిక్స్లో ప్రీమియర్ అయినప్పటి నుండి రెండు వారాల పాటు నంబర్ 1 ట్రెండింగ్ గా నిలిచి అద్భుతమైన ప్రయాణం చేసిన ఈ చిత్రం నేరుగా ఇండియన్ పనోరమకు ఎంపికై, IFFIలో స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకుంది. ఈ చిత్రం బోర్డు అందరికీ నచ్చిన అరుదైన చిత్రాలకు చెందినది. 2021లో దాదాపు అన్ని ఉత్తమ చిత్రాల జాబితాలలో ‘సినిమా బండి’ వుంది.
నటీనటులు, సిబ్బంది అందుకున్న ప్రేమ, ప్రశంసలు వారి కెరీర్ కు గొప్ప ఆరంభాన్ని ఇచ్చాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ కు భారీ విజయాన్ని అందించి, ఇండీ సినిమా నిజమైన స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది.