డీజీపీ ని కలిసిన యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మెన్ శ్రీ కె శివ కుమార్, బక్రీద్ సందర్భంగా గో హత్యలను అరికట్టాలి, బక్రీద్ సందర్భంగా గోవులను లీగల్ గా తరలిస్తున్నామని.. ఎంపీ అసదుద్దీన్ పోలీసులకు లేఖలు రాయడం దారుణం. ఒక పార్లమెంట్ సభ్యుడే.. గో వధ చట్టాలను ఉల్లంఘిస్తున్నాడు. తెలంగాణలో అక్రమంగా గోవులను తరలిస్తున్నారు. వెటర్నరీ సెర్టిఫికెట్ లేకుండా గోవులను తరలిస్తున్నారు. బహదూర్ పుర, చెంగిచెర్ల, ముషీరాబాద్ లలో అక్రమ స్లాటర్లు ఉన్నాయి. వెంటనే వాటిని మూసివేయాలని డిమాండ్. గోవుల అక్రమ రవాణాను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకట్టవేయలని డీజీపీ ని కోరాం. ఒవైసీ లేఖపై ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దు. పోలీసులు రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. తెలంగాణ లో గో హత్యలు జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదే.