CM KCR Visited His Adopted Village Vasalamarri, KCR Started Dalitha Bhandu Scheme, Telangana News, Telugu World Now,
Telangana News: వాసాలమర్రి గ్రామంలో 2గంటలకు పైగా దళితవాడలో పర్యటించిన సీఎం కేసీఆర్
యాదాద్రి భువనగిరి : దత్తత గ్రామం వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగించారు. సుమారు 2 గంటలకు పైగా దళితవాడలో సీఎం పర్యటించారు. దళిత వాడలోని 60 కుటుంబాలను సీఎం కేసీఆర్ పలుకరించి.. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
ఆ ఊరి గ్రామ సర్పంచ్ ఆంజనేయులు ఇంట్లో కేసీఆర్ భోజనం చేశారు. అనంతరం రైతు వేదిక భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో గ్రామాభివృద్ధిపై గ్రామస్థులతో చర్చించారు. గత పర్యటన సందర్భంగా తాను చేసిన పలు సూచనల అమలుతీరుపై ఈ సందర్భంగా సీఎం సమీక్షించారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు దిశానిర్దేశం చేశారు.
వాసాలమర్రి గ్రామానికి సీఎం కేసీఆర్ రావడం ఇది రెండోసారి. కాగా, గత జూన్ 22న తొలిసారిగా వాసాలమర్రికి వచ్చిన ముఖ్యమంత్రి.. గ్రామస్థులతో కలిసి గ్రామాభివృద్ధిపై చర్చించి అనంతరం సహపంక్తి భోజనం చేశారు. 42 రోజుల తర్వాత సీఎం మరోసారి గ్రామానికి వచ్చారు.
వాసాలమర్రి దళితుల అకౌంట్స్ లలో రేపే 10 లక్షల రూపాయలు జమ అవుతాయని హామీ ఇచ్చారు.