Entertainment : చాందిని చౌదరి కలర్ ఫోటో సినిమాతో హీరోయిన్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ సోషల్ మీడియాలో తాజాగా పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది..
కలర్ ఫోటో హీరోయిన్ శాంతిని చౌదరి తాజాగా ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ఉంచింది… ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఓ స్కామ్ గురించి షాకింగ్ విషయాలు రివీల్ చేసింది. తనతో పాటు సన్నిహితుల ఫొటోలు, పేర్లను వాడుకుంటూ ఇంటర్నేషనల్ నంబర్ల ద్వారా చేస్తున్న మోసంపై ఫాలోవర్స్‌ను హెచ్చరించింది. ఇలాంటి ఫ్రాడ్ కొన్ని నెలలుగా కొనసాగుతోందని గుర్తించిన చాందిని.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా బహిర్గతపరిచింది. ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తన శ్రేయోభిలాషులకు, అభిమానులకు తెలిపింది..
“కొద్ది నెలలుగా నాతో పాటు నా కోలీగ్స్ ఫొటోలు, పేర్లు ఉపయోగించి మోసానికి పాల్పడుతున్నారు. ఇంటర్నేషనల్ నంబర్ల ద్వారా వాట్సాప్‌లో కాంటాక్ట్ అవుతూ ఇన్‌ఫర్మేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఇతరత్రా పర్సనల్ సమాచారాన్ని పొంది ఆ తర్వాత వేధింపులకు గురిచేస్తున్నారు.. ఇలాంటి వారిని నమ్మి అసలు మోసపోవద్దు. మీకు ఈ విషయాన్ని తెలియజేయాలని స్క్రీన్ షాట్స్ సేవ్ చేసి ఉంచాను.. అలాగే వాళ్ళు వాట్స్అప్ నంబర్లు డిపిగా నా ఫోటోనే ఉంచుకున్నారు ఇలాంటివన్నీ మీరు గమనించి సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండండి ఎలాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.. ఆన్లైన్లో జరిగే మోసాలతో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఏమాత్రం ఆదమరిచి ఉన్న పెను ప్రమాదం తప్పదు ” అని తెలిపారు..