Entertainment ప్రస్తుతం టాలీవుడ్ లో యువ హాస్య నటుల ట్రెండ్ నడుస్తుంది.. వీరికి మంచి అవకాశాలు వస్తున్నాయి ప్రేక్షకులు కూడా హాస్యనటుల్ని మంచిగా ఆదరిస్తున్నారు అయితే ఇందులో ప్రియదర్శి కూడా ఒకరు అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ మంచి పేరును తెచ్చుకున్న ప్రియదర్శి తాజాగా తనకు జరిగిన ఓ అవమానం కోసం చెప్పకు వచ్చారు..
టెర్రర్ మూవీతో చిత్రసిమకు పరిచయం అయ్యాడు ప్రియదర్శి. తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని పెళ్లిచూపులు సినిమాతో తన కెరీర్ ను ఒక మలుపు తిప్పుకున్నాడు.. ఈ సినిమాకుగాను ఉత్తమ హాస్యనటుడిగా సైమా.. ఐఫా అవార్డులను సైతం గెలుచుకున్నాడు. అయితే ఇవన్నీ అంత తేలిగ్గా జరగలేదని తాను జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా తన సినీ జీవితం ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నాడు.. నటుడిగాఇక్కడ నెల తొక్కుకునే సమయంలో తనను ఎందరో అవమానించారని.. ఆడిషన్స్ చేస్తున్న సమయంలో తనను నల్లగా .. సన్నగా ఉన్నావని ఎద్దేవా చేసేవారని అన్నారు.. కొందరు ఛాన్స్ ఇస్తామని ఆశించి.. ఒక్కోసారి హీరో కంటే పొడుగ్గా ఉన్నావంటూ రిజక్ట్ చేసేవారని ప్రియదర్శి తెలిపాడు. అయితే పెళ్లి చూపులు సినిమా తన కెరీర్ను మలుపు తిప్పిందని ఆ తర్వాతే ఎన్నో అవకాశాలు తనకు వచ్చాయని చెప్పుకొచ్చాడు.. ‘ది ఘాజి అటాక్’.. ‘జై లవకుశ’.. ‘అర్జున్ రెడ్డి’.. ‘జాతిరత్నాలు’.. ‘మల్లేశం’.. ‘రాధేశ్యామ్’.. ‘సీతారామం’.. ‘ఒకే ఒక జీవితం’ వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు ప్రియదర్శి..