గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం జీఓ విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని టీపీసీసీ ఎన్నారై సెల్, గల్ఫ్ జెఏసి బృందం మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లతో కలిసి కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. సహకరించిన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, కాంగ్రేస్ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు, తోట ధర్మేందర్, గల్ఫ్ జెఏసి నాయకులు గుగ్గిల్ల రవిగౌడ్, మచ్చ మల్లికార్జున్, దువాస రామకృష్ణ, కాటిపెల్లి శ్రీనివాస రెడ్డి, షేర్ నర్సారెడ్డి పాల్గొన్నారు.
మంత్రి వ్యాఖ్యలను నేను సమర్ధించ లేదు… వక్రీకరించి హెడ్డింగ్ పెట్టారు : నిర్మాత నట్టి కుమార్