Entertainment : బాలీవుడ్లో మిగతా హీరోలకి భిన్నంగా వ్యవహరిస్తుంటారు… హీరో అక్షయ్ కుమార్, ముఖ్యంగా దేశ భక్తి, ప్రేక్షకులకు, అభిమానులకు హాని కలిగించని Entertainment బాలీవుడ్లో మిగతా హీరోలకి భిన్నంగా వ్యవహరిస్తుంటారు… హీరో అక్షయ్ కుమార్. ముఖ్యంగా దేశ భక్తి, ప్రేక్షకులు, అభిమానులకు హాని కలిగించని ప్రకటనల్లో నటించడం సహా…. ఏడాదికి నాలుగు, ఐదు సినిమాలు చేస్తూ… తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విమర్శకులకు అవకాశం ఇవ్వకుండా.. జాగ్రత్తగా వ్యవహరించే… ఈ స్టార్ హీరో తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఆ ప్రకటన ప్రజలకు జాగ్రత్తలు చెప్పేదే అయినా… అది పరోక్షంగా సూచించే విషయాల మాటేంటి అంటూ… తెగ ఇబ్బంది పెడుతున్నారు…. నెటిజన్లు.
రెండు ఎయిర్ బ్యాగ్లున్న కార్ కంటే ఆరు ఎయిర్ బ్యాగులున్న కార్‌ను కొనుగోలు చేయడం ఉత్తమం అంటూ.. ఓ సంస్థ రూపొందించిన ప్రకటనలో నటించారు.. అక్షయ్ కుమార్. ఈ వీడియోను… కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన సోషల్ మీడియా ఖాతా నుంచి పోస్టు చేశారు. దాంతో… అందులోని లోపాలపై నెటిజన్లు విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ పోస్ట్‌లో పెళ్లి సందర్భంగా కూతురుకు కొని పెట్టిన కారులో 2 ఎయిర్ బ్యాగ్‌లే ఉంటాయి. పోలీస్ ఆఫీసర్ గా అక్షయ్ సూచనతో ఆరు ఎయిర్ బ్యాగులున్న కార్ కొనేందుకు…పెళ్లి కూతురు తండ్రి ఒప్పుకుంటాడు. దాంతో… ఈ యాడ్ వరకట్నాన్ని ప్రోత్సహించేదిగా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తుండగా… మరికొందరేమో…. రోడ్డు నిర్మాణాల్లో లోపాల్ని సరిచేయకుండా… ఖరీదైన కార్లు కొనమని చెప్పడం ఏంటంటూ… ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. స్టార్ హీరోలు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తుంటే సామాన్య ప్రజలు వీటిని ఫాలో అవ్వరా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Thank You @akshaykumar for your support to the nationwide National Road Safety Campaign.
Your efforts in spreading the awareness on road safety issues is truly commendable.
We're committed to bring down road accidents in India with awareness & public participation. pic.twitter.com/vxZEZJIJmO
— Nitin Gadkari (@nitin_gadkari) September 9, 2022