Corona Virus Not Effected to Alcohol Drinking People? Health Tips For Corona Patients, Precautions about Covid19,
ఆల్కాహాల్ తాగితే నిజంగానే కరోనా వైరస్ సోకదా? సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు ?
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకు నాలుగు లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు, 3 వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఒక్కసారిగా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో బెడ్లు లభించక, సకాలంలో ఆక్సిజన్ అందక బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని ఆల్కహాల్ కాపాడగలదని.. ఇది మీ శరీరానికి రక్షణ కల్పిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు ఎక్కువగా పంజాబ్‌తో పాటు చాలా ప్రాంతాల్లో షికార్లు చేస్తున్నాయి. మరి ఆల్కాహాల్ తాగితే నిజంగానే కరోనా వైరస్ సోకదా? వైద్య నిపుణులు ఏమంటున్నారు?
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పంజాబ్ ఎక్స్పర్ట్ కమిటీ హెడ్ డాక్టర్ కె కె తల్వార్ క్లారిటీ ఇచ్చారు. మద్యం తీసుకుంటే కరోనా రాదనే వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఈ ఫేక్ న్యూస్ వలలో పడకూడదని ప్రజలను కోరారు. ఈ అంశంపై తల్వార్ పూర్తి వివరణ ఇచ్చారు. ‘కరోనావైరస్ నుంచి మద్యం రక్షణ కల్పిస్తుందని సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. దీంట్లో ఏమాత్రం నిజం లేదు. అంతేకాక, అధికంగా మద్యం సేవించడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి కరోనా సోకే అవకాశాలు ఇంకా పెరుగుతాయి. ఇలాంటి నకిలీ వార్తలు నమ్మితే భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వైరస్‌ను నిరోధించే శక్తి ఆల్కహాల్‌కు లేదు’ అని క్లారిటీ ఇచ్చారు. అయితే చాలా తక్కువ మోతాదులో మద్యం సేవించడం వల్ల ఎటువంటి హాని లేదని ఆయన అన్నారు.
వైరల్ అవుతున్న ఈ వార్తలపై పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పిజిఐఎంఆర్) మాజీ డైరెక్టర్ తల్వార్ మాట్లాడుతూ.. “ప్రజలు కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల ముందు, ఆ తర్వాత మద్యం సేవించడం మంచిది కాదు. దీని వల్ల దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉంది. ఇది అనేక శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. కాబట్టి, వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు, ఆ తర్వాత ప్రజలు మద్యానికి దూరంగా ఉండటమే మంచింది” అని పేర్కొన్నారు.