Food : చిన్నారుల నుంచి పెద్దల వరకు శాండ్ విచ్ అనగానే చాలా ఇష్టంగా తింటారు. స్నాక్ ఐటెంగా శాండ్ వించ్ ను తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ గా కూడా శాండ్ విచ్ బాగుంటుంది. ఎవరి అభిరుచికి తగ్గట్లు వారు శాండ్ విచ్ ను తయారు చేసుకుని తింటారు. అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పెరుగు శాండ్ విచ్ ఎలా తయారు చేయాలో మీకోసం ప్రత్యేకంగా…
పెరుగు శాండ్ విచ్ తయారీకి కావాల్సిన పదార్థాలు :
బ్రెడ్ – 4 స్లైస్ లు, క్యారెట్ – 1 , చక్కెర పొడి – అవసరం మేరకు, స్వీట్ కార్న్ – 1/4 కప్పులు, క్యాబేజీ – 3/4 కప్పులు , మిరియాలు – రుచి కోసం తగినంత, క్యాప్సికం – 1/4 కప్పులు
కర్డ్ శాండ్ విచ్ తయారీ విధానం :
మొదట మంచి గడ్డ పెరుగు తీసుకోవాలి. దానిని ఒక గుడ్డలో వేసి నీళ్లు పోయేలా గట్టిగా కట్టి వడకట్టాలి.
ఓ రెండు గంటల వరకు దానిని పక్కన పెట్టాలి. ఆ సమయం వరకు పెరుగులోని నీరంతా పోతుంది.
తర్వాత గుడ్డలోని పెరుగును వేరు చేయాలి.
ఆలోపు స్వీట్ కార్న్ ఉడకబెట్టాలి. నీరు వేరు చేసిన పెరుగును ఓ గిన్నెలో తీసుకోవాలి.
ఉడకబెట్టి పక్కన పెట్టిన స్వీట్ కార్న్, క్యాబేజీ తురుము, సన్నగా తరిగిన క్యారెట్, చిన్నగా కోసి పక్కన పెట్టుకున్న క్యాప్సికం వేసి బాగా కలపాలి.
తర్వాత అందులో కొద్దిగా చక్కెర పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొన్ని మిరియాలు వేసి మిక్స్ చేయాలి.
తర్వాత బ్రెడ్ స్లైస్ లను తీసుకుని వాటి అంచులను కట్ చేసుకోవాలి.
తయారు చేసి పక్కన పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని బ్రెడ్ పైన సమాంతరంగా పరుచుకోవాలి.
దానిపై మరో బ్రెడ్ స్లైస్ పెట్టుకోవాలి. బ్రెడ్ పచ్చిగా తినడం ఇష్టం లేకపోతే.. బ్రెడ్ స్లైస్ లను టోస్ట్ చేసుకోవాలి.
తర్వాత వాటిపై పెరుగు మిశ్రమాన్ని పరుచుకోవాలి.
అంతే బ్రెడ్ శాండ్ విచ్ రెడీ అయినట్లే.
ఇక పక్కనే సాస్ తో సర్వ్ చేసుకోని టేస్టీ కర్డ్ శాండ్ విచ్ ని తినేయండి…