వరదల్లో కొట్టుకెళ్తున్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన పోలీసులను ఈరోజు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపిఎస్., గారు డిసిపి ట్రాఫిక్ శ్రీనివాస్ రావు, ఐపిఎస్., శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లవకుమార్ రెడ్డి ల సమాక్షంలో రివార్డులు అందజేశారు.
ఇటీవలే కూర్చిన భారీ వర్షాలకు, హిమాయత్ సాగర్ జలాశయం నిండుకుని వరద నీరు ప్రవహింస్తున్నపుడు నిన్న సాయంత్రం (తేదీ 26.07.2022) సుమారు 4:45 గంటల సమయంలో JBIT ఇంజనీరింగ్ కాలేజీలో నందు బీటెక్ చదువుతున్న అరవింద్ గౌడ్ అనే విద్యార్థి బైక్‌పై దర్గా కలీజ్ ఖాన్ నుండి శంషాబాద్ వైపు వెళ్ళుటకు హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్ వంతెనను దాటడానికి ప్రయత్నింస్తూ ఉండగా వరద ఉధృతిలో కొట్టుకుపోతున్న సమయంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పొలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న రికవరీ వ్యాన్ బృందం వారు హెడ్ కానిస్టేబుల్ బేగ్, డ్రైవరు మల్లాంగ్ షా, హెల్పెర్స్ రాకేశ్ మరియు విజయ్ లు నీటిలో కొట్టుకుపోతుఉన్న బాధితుడిని ప్రాణాలతో రక్షించారు. తమకు అప్పగించిన విధుల పట్ల అత్యంత చిత్తశుద్ధితో మరియు శ్రద్ధతో విధులు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ బేగ్ డ్రైవరు మల్లాంగ్ షా, హెల్పెర్స్ రాకేశ్ మరియు విజయ్ లను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందిస్తూ రివార్డులు అందజేశారు.