Entertainment బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సరసన దీపిక పదుకొనే నటించిన పటాన్ చిత్రం ఇటీవల విడుదలై ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో షారుక్ ఖాన్ క్రేజ్ మరింత పెరిగిపోవడమే కాకుండా దీపికా పదుకొనే సైతం మరింత స్టార్ డమ్ సంపాదించుకుంది. అలాగే ఈ సినిమాలో యాక్షన్స్ సన్నివేశాల్లో ఎంతో తేలికగా నటించిన దీపిక మరిన్ని అవకాశాలు కొట్టేసినట్టు సమాచారం. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి తెర్కెక్కించబోతున్న సినిమాలో అవకాశం అందుకోనుందని కూడా తెలుస్తోంది..
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కు ఎన్నో ఏళ్ల నుంచి హిట్ లేని సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన పటాన్ చిత్రంతో అతనికి హిట్ అందింది. అలాగే దీపికా పదుకొనే సైతం ఈ సినిమాలో తన టాలెంట్ చూపించి సినిమా హిట్ అవ్వడానికి తన వంతు కృషి చేసింది. అయితే ఈ సినిమా హిట్‌తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన షారుఖ్ తో పాటు దీపికా పదుకొనే సైతం వరుస అవకాశాలు అందుపుచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది..
దర్శక ధీరుడు రాజమౌళి త్వరలోనే మహేష్ బాబుతో ఒక సినిమాను చేయనున్నారని తెలిసిందే. అయితే ఈ సినిమాలో దీపికా పదుకొనే నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందుకు రాజమౌళి దీపికాను సంప్రదింపులు సైతం చేశారంట. ఇదే నిజమైతే దీపిక టాలీవుడ్ లో కనిపించనుంది. అయితే అసలు విషయం ఏంటి అని తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే..