Poorna : టాలీవుడ్ యాక్ట్రెస్ అయిన పూర్ణ ఇటీవలే పండంటి మగబిడ్డకు దుబాయ్ లో జన్మనించింది. గత ఏడాది అక్టోబర్ లో ఎటువంటి హడావుడి లేకుండా పెళ్లి చేసేసుకున్న పూర్ణ.. ఆ విషయాన్ని కొన్నిరోజులు తరువాత సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది. కేరళకు చెందిన శనిద్ అసిఫ్ అలీ అనే వ్యక్తి దుబాయిలో ప్రముఖ వ్యాపార వేత్తగా ఎదిగాడు. ఈ వ్యక్తినే పూర్ణ పెళ్లి చేసుకున్నది. ఇక వీరిద్దరి పెళ్ళైన రెండు నెలలకే పూర్ణ తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చి దుబాయ్ లోనే ఉంటూ వస్తుంది.
తన సీమంతం వేడుకను కూడా అక్కడే ఘనంగా చేసుకుంది. ఇక ఏప్రిల్ 4న ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి హాస్పిటల్ లోని ఫోటోలను షేర్ చేసి ఆ గుడ్ న్యూస్ ని అందరితో పంచుకున్న పూర్ణ.. కొడుకు పేస్ ని మాత్రం ఇప్పటి వరకు రివీల్ చేయకుండా వచ్చింది. దీంతో పూర్ణ కూడా అందరి హీరోయిన్స్ లా వారసులు విషయంలో గోప్యత వహిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ పూర్ణ ఆ గోప్యతకి ఫుల్ స్టాప్ పెట్టి తన ముద్దుల కొడుకుని అందరికి చూపించింది. తన భర్త, బిడ్డతో కలిసి ఇటీవల ఒక పెళ్లి కార్యక్రమానికి పూర్ణ హాజరయ్యింది.
ఆ ఈవెంట్ లో ఫోటోగ్రాఫర్స్ కి పూర్ణ తన కొడుకుతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలు చూసిన నెటిజెన్స్ బుడ్డోడు భలే ముద్దుగా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా పూర్ణ చివరిగా నాని ‘దసరా’ సినిమాలో కనిపించింది. త్వరలోనే ఆమె మళ్ళీ సినిమాలోకి వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా పూర్ణ మలయాళీ అమ్మాయి. కానీ ఈ భామ తెలుగు సినిమాలతో స్టార్‌డమ్ ని సంపాదించుకుంది.