Akira Nandan : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వారసుడు అకీరా నందర్ మూవీస్ ఎంట్రీ గురించి తెలిసిందే ,అయితే అది ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తర్వలో ఆన్‌స్ర్కీన్‌పై అకీరా అలరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న పవర్‌స్టార్ సినిమా OGలో అకిరా మెరవనున్నాడని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. మరి అకీరా ఎంట్రీ ఎప్పుడు?
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వారసుడు అకీరా నందన్ సందడి ఫ్యాన్స్‌లో జోష్ తెప్పించింది. బ్రో విడుదల సందర్భంగా హైదరాబాద్ సుదర్శన్ థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన అకీరా తెగ ఎంజాయ్ చేశాడు. అకీరా మాత్రం ఫ్యాన్స్ మెచ్చె విధంగా ఎలా నటించాలో తెలుసుకోడానికి అభిమానుల ఆనందాన్ని ప్రత్యక్షంగా చూడటానికి థియేటర్లకు వస్తున్నాడు. అకీరా వ్యవహార శైలిని పరిశీలిస్తున్న పవన్ ఫ్యాన్స్ తండ్రిని మించిన తనయుడిగా అవతరిస్తాడని ఆకాశానికెత్తేస్తున్నారు.
ఇక అకీరా త్వరలో ఆన్ స్క్రీన్‌పై కనిపించనున్నట్లు చెబుతున్నారు. పవన్ నటిస్తున్న OGలో అకీరా నటించనున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఇప్పటికే ఓ షార్ట్ ఫిల్మ్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు అకీరా. అంతేకాదు పవన్ దగ్గరుండి మరీ మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ ఇప్పించాడు. OG లో పవన్ మరోసారి మార్షల్ ఆర్ట్స్ తో కనపడబోతున్న సంగతి తెలిసిందే. మరి అకీరా ఎంట్రీ ఎప్పుడో.. OGలో మెరుస్తాడా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న పవన్ కళ్యాణ్ OG సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇందులో నిజంగానే అకిరా ఉంటే సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతాయి.