Naresh62 : టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ‘నాంది’ సినిమా నుంచి తన స్క్రిప్ట్ సెలక్షన్ మొత్తం మార్చేశాడు. ఒకప్పుడు కామెడీ కథలతో ఆడియన్స్ ని నవ్వించిన నరేష్.. ఇప్పుడు ఇంటెన్స్ స్టోరీస్ తో ప్రేక్షకులను ఎమోషనల్ చేస్తున్నాడు. ఇటీవలే ‘ఉగ్రం’ సినిమాతో తనలోని ఉగ్రాన్ని చూపించి క్లాప్స్ కొట్టించుకొని మంచి హిట్టుని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరో ఇంటెన్స్ స్టోరీ లైన్ తో రాబోతున్నాడు. నేడు (జూన్ 30) అల్లరి నరేష్ పుట్టినరోజు కావడంతో తన 62వ సినిమాని ప్రకటించాడు.
‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి N62 కి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక ఈ మూవీ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. కథ చెప్పడానికి నరేష్ కి ఫోన్ చేసిన దర్శకుడు.. ఆ స్టోరీని బార్ లో కూర్చోబెట్టి నేరేట్ చేస్తాడు. మూర్ఖత్వంతో బ్రతికే ఒక వ్యక్తి కథే ఈ సినిమా స్టోరీ లైన్ అని సింపుల్ గా చెప్పేశాడు. అలాగే అదే బార్ లో చిత్ర యూనిట్ ని కూడా అనౌన్స్ చేసేశాడు. రాజెశ్ దండా, బాలాజీ గుట్ట హాస్య మూవీస్ పతాకం పై ఈ సినిమాని నిర్మించబోతున్నారు.
సీతారామం ఫేమ్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నాడు. రిచర్డ్ ఎమ్ నాథన్ డిఒపి, చోట కే ప్రసాద్ ఎడిటర్ గా చేయబోతున్నారు. 1990 బ్యాక్‌గ్రౌండ్ తో ఈ సినిమా కథ నడవనుంది. సెప్టెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూట్ మొదలు కాబోతుంది. ప్రస్తుతం నరేష్ ‘సభకు నమస్కారం’ సినిమా చేస్తున్నాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని సతీష్ మల్లంపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది.