Chiranjeevi-Bholaa Shankar : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తరువాత చేస్తున్న సినిమా భోళా శంకర్. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) హీరోయిన్ గా నటిస్తుంది. గ్యాంగ్ స్టార్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సినిమా కథ ఉండబోతుంది. ఇక చిరుకి చెల్లిగా మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) కనిపిస్తుంటే ఆమెకు జోడిగా అక్కినేని హీరో సుశాంత్ కీర్తికి కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
రిలీజ్ దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ లో వేగంగా పెంచేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక సాంగ్ అండ్ టీజర్ ని రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటని రిలీజ్ చేశారు. ‘జాం జాం జజ్జనక’ అనే సాగే పార్టీ సాంగ్ ని విడుదల చేశారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. ఇక శేఖర్ మాస్టర్.. చిరు, తమన్నా, కీర్తి, సుశాంత్ తో పాటని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశాడు.
కాగా ఈ మూవీ తమిళ హిట్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్యలో గోదావరి యాసతో అదరగొట్టిన చిరు.. ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో అలరించబోతున్నాడు. వాల్తేరు చిత్రంలో లాగానే ఈ మూవీలో కూడా వింటేజ్ చిరు కామెడీ కనిపిస్తుందని మేకర్స్ తెలియజేస్తున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. ఆగష్టు 11న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.