Bholaa Shankar : మెగాస్టార్ చిరంజీవి , మిల్కీ బ్యూటీ తమన్నా , కీర్తి సురేష్ , అక్కినేని హీరో సుశాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా భోళా శంకర్. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆగష్టు 11న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్ గా జరిగింది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే నాలుగు సాంగ్స్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి.
తాజాగా ఈ మూవీ నుంచి ‘కొట్టారా కొట్టు తీనుమారు’ అనే సాంగ్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. మాస్ బీట్స్ తో సాంగ్ అదిరిపోయింది. ఇక ఈ పాటకి చిరుతో పాటు కీర్తి కూడా ఒక రేంజ్ స్టెప్పులు వేసినట్లు తెలుస్తుంది రిలీజ్ అయిన లిరికల్ సాంగ్ చూస్తుంటే. ఈ పాటకి థియేటర్స్ లో జాతర కనిపించనుంది. ఈ పాటని పడగా, శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేశాడు. కాగా ఈ మూవీ తమిళ్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ గా వస్తుంది. గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సినిమా ఉండబోతుంది.
వాల్తేరు వీరయ్య మూవీలో తన వింటేజ్ కామెడీతో అలరించిన చిరంజీవి.. ఈ సినిమాలో కూడా అదే రేంజ్ లో ఎంటర్టైన్ చేయనున్నాడట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపిస్తూ.. పవన్ మూవీలోని సీన్స్ ని రీ క్రియేట్ చేయడమే కాకుండా, పవన్ మ్యానరిజమ్స్ తో చిరు నవ్వించబోతున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో 200 కోట్లకు పైగా కలెక్షన్స్ కొట్టి బ్లాక్ బస్టర్ అందుకున్న చిరు.. ఈ సినిమాతో అదే హిట్టుని రిపీట్ చేస్తాడా? లేదా? చూడాలి.