Chiranjeevi Indra Movie Records Collections List హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 2005లో రజినీకాంత్ ‘చంద్రముఖి’ రిలీజ్ అయ్యేవరకు ఈ రికార్డు అలానే ఉంది. అలాగే ఆ ఏడాది ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ గా షారుఖ్ ఖాన్ ‘దేవదాస్’ నిలిస్తే.. దాని తరువాత సెకండ్ ప్లేస్ లో ఇంద్ర నిలిచింది.
ఇక థియేటర్స్ విషయానికి వస్తే.. తెలుగు, కన్నడ, ఒడిశా స్టేట్స్ తో కలిపి ఇండియా వైడ్ 268 థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. 151 సెంటర్స్ లో 50 రోజులు ఆడి రికార్డు సాధించింది. వీటిలో 9 కర్ణాటక, 2 ఒడిశాలోని థియేటర్స్. ఇక 100 రోజులు 122 సెంటర్స్ లో ప్రదర్శించగా 4 కర్ణాటకలోనివి కావడం విశేషం. ఇంద్రసేనుడి ప్రభంజనం అక్కడితో ఆగిపోలేదు 32 సెంటర్స్ లో 175 రోజులు, ఆదోని సత్యం థియేటర్ లో 247 రోజులు రన్ అయ్యి రికార్డు క్రియేట్ చేసింది.
కేవలం 10 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 2 కోట్లకు పైగా టికెట్స్ సెల్ అయ్యినట్లు సమాచారం. అప్పటిలో టికెట్ ధర 5రూ, 10రూ కాబట్టి 40 కోట్ల దగ్గర కలెక్షన్స్ ఆగిపోయింది. ఇప్పటి రోజుల్లో అయితే సింపుల్ గా 350 నుంచి 400 కోట్లు కొల్లగొడుతుంది. అంతేకాదు ఈ రోజుల్లో సినిమా బడ్జెట్ బట్టి టికెట్స్ ధరని పెంచుతుంటారు. కానీ ఆ సమయంలో అలా ఉండేది కాదు. అయితే అప్పటిలో బ్లాక్ టికెట్ల దందా ఉండడంతో చిరంజీవి వంటి స్టార్ హీరో సినిమాలకు బ్లాక్ లో అప్పటిలోనే ఒక్కో టికెట్ 500రూ పలికేవి.