Gaddar : ఇన్నాళ్లు తన పాటలతో పల్లె ప్రజలను ఉర్రూతలూగిస్తూ వచ్చిన ప్రజాగాయకుడు గద్దర్ నేడు ఆగష్టు 6న కన్నుమూశారు. ఉద్యమ గళం వినిపించే గద్దర్ తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించారు, ఎన్నో బెదిరింపులూ ఎదురుకున్నారు. అంతేకాదు 1997లో ఆయన పై హత్యాయత్నం కూడా జరిగింది. ఎన్ని జరిగినా ఆయన గళం మాత్రం ఆగలేదు. గద్దర్ లేకపోయినా ఆయన పాటలు మాత్రం చిరస్థాయిగా నిలిచి ఉంటాయి.ఆయన ,ఆయన పాటలు ఎంతో స్పూర్తి దాయకం గా నిలుస్తాయి
1949 అక్టోబర్ 8న జన్మించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. 77 ఏళ్ళ వయసులో కన్నుమూసిన గద్దర్ మరణ వార్త తెలుసుకున్న తెలంగాణ ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు గద్దర్ మరణం పై సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ సాయి ధరమ్ తేజ్.. తదితరులు పోస్టులు వేశారు.ప్రజాగాయకుడు గద్దర్ మరణవార్త తెలియడంతో సినీ, రాజకీయ ప్రముఖులు గద్దర్ మరణం పై సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్..ఇంకా తదితర నటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు .ఆయన పాటలకు ఎంతో మంది అభిమానులు వున్నారు . ప్రముఖ నటులు సహితం ఆయనకు పోస్ట్ ల ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు అంటే అభిమానం ఎంత స్తాయిలో పొందాడో తెలుస్తుంది .అలాంటిది గద్దర్ ఇక లేరు అనే వార్తా తొలిచి వేస్తుంది .