Ileana D’Cruz : రామ్ హీరోగా నటించిన దేవదాసు చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన చిన్నది ఇలియానా(Ileana). పోకిరి చిత్రంతో తెలుగులో టాప్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించింది. కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న టైమ్‌లో బాలీవుడ్‌కు చెక్కేసింది. అయితే.. అక్కడ ఆమెకు కలిసిరాలేదనే చెప్పాలి. కొంతకాలం సెలెంట్‌గా ఉన్న గోవా బ్యూటీ సడెన్‌గా ప్రెగ్నెన్సీ అంటూ ప్రకటించి అందర్ని ఆశ్చర్యపరిచింది. బేబీ బంప్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఇలియానా ప్రస్తుతం హాట్‌టాఫిక్‌గా మారింది. అయితే.. తన ప్రెగ్నెన్సీకి ఎవరు కారణం అనేది మాత్రం చెప్పడం లేదు. తాజాగా తన ప్రియుడికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఇలియానా పోస్ట్ చేసింది. కుక్క పిల్లకు తన ప్రియుడు ముద్దు పెడుతున్న ఫోటోను ఉంచింది. అయితే.. అతడి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడింది. ఇప్పటి వరకు ముఖం కనిపించకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఫోటోలు పోస్టు చేస్తుంది.
అంతకముందు కూడా ఓ పోటోను పోస్ట్ చేసింది. అందులో తల్లికావడం అనేది ఓ మంచి అనుభూతి అని, ఇలాంటి అనుభూతిని తాను చూస్తానని ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. ఒక జీవి తనలో ప్రాణం పోసుకుంటుంది అనే ఆలోచన చాలా అద్భుతంగా ఉందని తెలిపింది. తాను ఎలాంటి తల్లిని అవుతానో తనకు తెలీదు అనీ అయితే.. చిన్నారికి మాత్రం తన ప్రేమను మొత్తం అందిస్తానని తెలిపింది. ఆ ఫోటోని వ్యక్తి గురించి రాస్తూ నన్ను నేను మరిచిపోయిన రోజుల్లో ఇతడు నాకు అండగా నిలిచాడు. నా కన్నీళ్లు తుడిచాడు. ఆ సమయంలో నాకు ఏమీ కావాలో అవన్నీ ఇచ్చాడు అంటూ ఇలియానా ఆ పోస్టులో రాసుకొచ్చింది. అయితే.. ఆ ఫోటోలో కూడా అతడి ముఖాన్ని చూపించలేదు.