Siddharth Galla : సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఫ్యామిలీ నుంచే ఇప్పటికే చాలా మంది హీరోలు, నటులు ఉన్నారు. ఇటీవల కొన్నేళ్ల క్రితం మహేష్ ఫ్యామిలీ నుంచి గల్లా అశోక్(Galla Ashok) హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ అక్క గల్లా పద్మావతి తనయుడు అశోక్ ‘హీరో'(Hero) సినిమాతో టాలీవుడ్(Tollywood) లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్ధగా సక్సెస్ తేకపోయిన , పర్వాలేదనిపించింది. ఇటీవలే తన రెండో సినిమాని కూడా ప్రకటించాడు.
మహేష్ అల్లుడిగా గల్లా అశోక్ ఎంట్రీ ఇవ్వడంతో మహేష్ కూడా మొదట్నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. మహేష్ అభిమానులు కూడా గల్లా అశోక్ కి సపోర్ట్ చేశారు. ఇప్పుడు మహేష్ మరో అల్లుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గల్లా జయదేవ్ – పద్మావతిల రెండో కొడుకు, గల్లా అశోక్ తమ్ముడు సిద్ధార్థ గల్లా కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తాడని, శ్రీలీలను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైనట్టు తెలుస్తుంది. దీంతో త్వరలోనే మహేష్ అల్లుడు సిద్ధార్థ్ గల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తన పెద్దల్లుడికి సపోర్ట్ ఇచ్చినట్టే చిన్నల్లుడికి కూడా మహేష్ సపోర్ట్ ఇస్తారని అంతా భావిస్తున్నారు. ఈ సారి చిన్న అల్లుడి సినిమా మంచి సక్సెస్ అవ్వనుందా .. అయితే మహేష్ అభిమానులు కూడా సినిమా కోసం ఎధురుచూస్తున్నారు .