Guntur Kaaram : మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం మూవీ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ‘గుంటూరు కారం’ అనే మాస్ టైటిల్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
కానీ గుంటూరు కారం సినిమా షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. సినిమా నుంచి పూజాహెగ్డే హీరోయిన్ గా తప్పుకుంది. మరికొంతమంది ఆర్టిస్టులు కూడా తప్పుకున్నారు. మహేష్ టైం దొరికినప్పుడల్లా ఫారిన్ కి వెళ్తుండటంతో సినిమాని పట్టించుకోవట్లేదు అని కామెంట్స్ వస్తున్నాయి. ఇటీవల మహేష్ అభిమానులే ఈ సినిమా ఆపేయండి అని కామెంట్స్ కూడా చేశారు. ఇన్ని కారణాలతో గుంటూరు కారం సినిమాపై బాగా నెగిటివిటి ఏర్పడింది.
సినిమాకు వస్తున్న నెగిటివిటి తగ్గించడానికి చిత్రయూనిట్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. నేడు మహేష్ బాబు పుట్టిన రోజు కావడంతో అర్ధరాత్రి 12 గంటల 6 నిమిషాలకు అప్డేట్ ఇస్తామని ప్రకటించారు. అయితే అభిమానులు టీజర్ కానీ, సాంగ్ కానీ రిలీజ్ చేస్తారని అనుకున్నారు. తీరా చూస్తే మహేష్ బాబుకి బర్త్ డే విషెష్ చెప్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో మహేష్ లుంగీ కట్టి.. బీడీ కాలుస్తూ.. కళ్ళజోడు పెట్టి.. మాస్ లుక్ లో ఉండటంతో పోస్టర్ వైరల్ గా మారింది.
ఇటీవల గుంటూరు కారం సినిమా మళ్ళీ షూట్ మొదలుపెట్టినట్టు సమాచారం. 2024 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు. ఇలా మెల్లిగా సినిమా సాగితే సంక్రాంతికి రిలీజ్ కష్టమేమో అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు పోస్టర్ తో పాటు సంక్రాంతికి రిలీజ్ పక్కా అని క్లారిటీ ఇస్తూ జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ అని ప్రకటించారు.