Mukku Avinash-Anuja : ముక్కు అవినాష్. పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత బిగ్‌బాస్ రియాలిటీ షోకి వెళ్లి మరింత పేరు సంపాదించుకున్నాడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు వెల్లివిరుస్తాయి. తన స్నేహితురాలైన అనూజ(Anuja)ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట పలు రియాలిటీ షోలు కూడా చేసింది. అయితే.. తాజాగా ఓ శుభవార్త చెప్పింది.
త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని యూట్యూబ్ వేదికగా అవినాష్ చెప్పాడు. తన భార్య అనూజ ప్రెగ్నెంట్ అని. త్వరలోనే ఇంట్లోకి బాబు లేదా పాపాయి రాబోతుందన్నాడు. పెళ్లై ఏడాన్నర అవుతోంది. అక్టోబర్‌లో మా పెళ్లి రోజు ఉంది. ఇంకా పిల్లలను ఎప్పుడు కంటారు అని మమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అయితే.. దీనికి ఇప్పుడు సమాధానం చెబుతున్నామన్నాడు.
ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఎప్పటి నుంచో మీతో ఈ విషయాన్ని పంచుకోవాలని అని అనుకున్నాను. అయితే.. మూడు నెలల వరకు ఎవ్వరికీ చెప్పవద్దు అని డాక్టర్లు సలహా ఇవ్వడంతో చెప్పలేదన్నాడు. ఇప్పుడు తనకి నాలుగో నెల. అందుకే బయటకు చెబుతున్నా. ఈ విషయం తెలిసి మా ఇద్దరి కంటే మా అమ్మానాన్న, అత్తామామలు ఎంతో ఆనందపడ్డారు. ఇక బేబీ గుండె చప్పుడు విన్నాం. అప్పుడు కలిగిన ఫీలింగ్‌ను మాటల్లో వర్ణించలేను అంటూ తన సంతోషాన్ని బయట పెట్టాడు అవినాష్. తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకుని ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యారు .