Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ (Jailer) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు . ఈ చిత్రం తరువాత లాల్ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే ఆ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేసేశాడు. ఇప్పుడు తన తదుపరి సినిమా షూటింగ్ మొదలుపెట్టే పనిలో పడ్డాడు. తన 170వ సినిమాని జై భీమ్ దర్శకుడు టి జె జ్ఞానవేల్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది.
ఈ క్రమంలోనే ఈ మూవీలో నటించే క్యాస్ట్ అండ్ క్రూని చిత్ర యూనిట్ ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో మన నేచురల్ స్టార్ నాని ని కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. నాని మాత్రమే కాదు ఫహద్ ఫాసిల్, అమితాబ్ బచ్చన్, మంజు వారియర్.. ఇలా సౌత్ టు నార్త్ స్టార్ క్యాస్ట్ ని ఎంపిక చేశారు. అయితే దీని పై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. కానీ ఈ న్యూస్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యిపోయింది. ఇక నానిని రజినీ సినిమాలో కనిపించబోతున్నాడని వినిపించడంతో టాలీవుడ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
మరి ఈ వార్త నిజం అవుతుందా? లేదా రూమర్ గానే మిగిలిపోతుందా? అనేది చూడాలి. కాగా ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. జై భీమ్ లా ఈ చిత్రాన్ని కూడా సోషల్ ఎలిమెంట్ తోనే చిత్రీకరించబోతున్నాడు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక జైలర్ విషయానికి వస్తే.. ఈ నెల 10న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. బీస్ట్ ఫేమ్ నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, నాగబాబు, సునీల్, జాకీ ష్రాఫ్, తమన్నా, రమ్య కృష్ణ.. ఇలా చాలామంది స్టార్స్ కనిపించబోతున్నారు.