NTR :ఎన్టీఆర్ RRR వంటి గ్లోబల్ హిట్ తరువాత ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఒక పక్క బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో సినిమాలు సెట్ చేస్తూనే.. మరోపక్క కమర్షియల్ యాడ్స్ తో కూడా అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఫుడ్, డ్రింక్ మరియు ఇతర బ్రాండ్స్ కి అంబాసడర్ గా ఎన్టీఆర్ సైన్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే లీషియస్ , యాపీ ఫిజ్ , మెక్ డొనాల్డ్స్ వంటి యాడ్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఎన్టీఆర్.. ఆ యాడ్స్ లో తన లుక్స్ తో వావ్ అనిపిస్తున్నాడు.
తాజాగా ఇప్పుడు మరో యాడ్ చేయడానికి సిద్దమయ్యాడు. నిన్న ఈ యాడ్ కి సంబంధించిన షూటింగ్ జరిగినట్లు సమాచారం. ఇక ఈ యాడ్ లో ఎన్టీఆర్ స్టైలిష్ గా కనిపించేలా ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్.. ఎన్టీఆర్ ని అదిరిపోయే లుక్స్ లో రెడీ చేశాడు. గడ్డం, కళ్ళజోడు, వావ్ అనిపించే హెయిర్ స్టైల్ తో ఎన్టీఆర్ సూపర్ ఉన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఇది బ్రాండ్ కి సంబంధించిన షూట్? అనేది తెలియలేదు. కాగా ఈ యాడ్స్ కోసం ఎన్టీఆర్ 6 – 8 కోట్లు వరకు తీసుకున్నట్లు సమాచారం. ఒక యాడ్ కోసమే ఎన్టీఆర్ ఇంత మొత్తంలో తీసుకుంటుంటాడా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇక ఎన్టీఆర్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ వార్2 లో భాగం కాబోతున్నాడు. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.