Pawan Kalyan Bro Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan), సుప్రీం హీరో సాయిధరమ్(Sai Dharam Tej) కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో'(Bro). తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయ సితం(Vinodaya Sitham) సినిమాకు ఇది రీమేక్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతోంది. సముద్రఖని(Samuthirakani) దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇందులో పవన్ మరోసారి దేవుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే బ్రో సినిమా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుందని చిత్రయూనిట్ తెలిపారు. ఇక బ్రో సినిమాను జులై 28న రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు.
ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులకు స్పెషల్ ఆఫర్ ఇచ్చింది నిర్మాణ సంస్థ. స్టార్ హీరోల సినిమా రిలీజ్ లు వస్తే వాళ్ళ భారీ కటౌట్స్ పెడతారని తెలిసిందే. అయితే ఈ కటౌట్స్ ని ఫ్యాన్స్ ఫొటోస్ తో నింపేస్తామని నిర్మాణ సంస్థ ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రో సినిమాకు పవన్, తేజ్ కటౌట్స్ లో అభిమానుల ఫోటోలు పెడతామని, ఫొటోలతోనే కటౌట్స్ తయారుచేస్తామని, అందుకోసం అభిమానులు తమకు నచ్చిన ఫోటోలను పంపించండి అంటూ ఓ లింక్ కూడా ఇచ్చింది.
పవన్, మెగా అభిమానులు తమకు ఇష్టమైన ఫోటోలు పంపాలి అంటూ ఓ లింక్ ఇచ్చింది నిర్మాణ సంస్థ. ఈ లింక్ లో ఫొటోలతో పాటు, మరిన్ని వివరాలు అందచేయాలని కోరారు. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కటౌట్స్ ఏర్పాటు చేస్తామని, అభిమానులకు ఇది స్పెషల్ గా గుర్తుండిపోయేలా చేస్తామని తెలిపారు. దీంతో పవన్ అభిమానులు తమ ఫోటోలని పంపిస్తున్నారు. తమ హీరో కటౌట్స్ పై తమ ఫోటోలు చూసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.