Game Changer : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చెంజర్’ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. RRR వంటి సక్సెస్ తరువాత చేస్తున్న సినిమా కావడం, అదికూడా శంకర్ దర్శకుడు కావడంతో మూవీ పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఇక శంకర్ కూడా తన ఒరిజినల్ స్టైల్ సామజిక సమస్యని కమర్షియల్ ఫార్మాట్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తుండడంతో మరింత హైప్ ని క్రియేట్ చేస్తుంది. పొలిటికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకి మరో తమిళ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథని అందిస్తున్నాడు.
కాగా ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు పలు ఫోటోలు లీక్ అయ్యాయి. వాటిని బట్టి చూస్తే.. చరణ్ ఈ సినిమాలో మోడరన్ లుక్ లో, అలాగే పొలిటికల్ లుక్ లో కనిపించాడు. దీంతో రెండు డిఫరెంట్ రోల్స్ లో రామ్ చరణ్ కనిపించబోతున్నాడని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు మరో ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. చరణ్ ఈ సినిమాలో ఒకటి రెండు పాత్రల్లో కాదు ఏకంగా 7 పాత్రల్లో కనిపించబోతున్నాడట. గతంలో శంకర్ తెరకెక్కించిన ‘అపరిచితుడు’ సినిమాలో విక్రమ్ మూడు రోల్స్ కనిపించి అదరగొట్టాడు.
ఇప్పుడు గేమ్ చెంజర్ లో కూడా రామ్ చరణ్ అలాగే అనేక పాత్రల్లో కనిపించి ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ చేయబోతున్నాడని సమాచారం. మరి ఈ వార్త నిజామా? లేదా అబద్దం అనేది తెలియదు. ఒకవేళ ఇది నిజమైతే చరణ్ అభిమానులకు పండగనే చెప్పాలి. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్న రామ్ చరణ్.. ఇప్పుడు ఒకే సినిమాలో ఏడు విభిన్న పాత్రలు చేస్తున్నాడు అంటే ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి మొదలవుతుంది. కాగా ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.