Samantha- Emotional Post : సమంత(Samantha) చేస్తున్న ఖుషి(Kushi) సినిమా, సిటాడెల్(Citadel) షూటింగ్స్ పూర్తవ్వడంతో కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక సంవత్సరం వరకు సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నాను అని చెప్పడంతో అభిమానులు షాక్ కి గురయ్యారు. ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోయింది. అయితే సమంత తన ఆరోగ్యంపై ఫోకస్ చేయడానికి, తన మయోసైటిస్(Myositis) చికిత్సకు అమెరికాకు వెళ్తున్నందునే సమంత కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
సమంత త్వరలో అమెరికా వెళ్లనుంది. తాజాగా తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఫ్యామిలీ మెన్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే లతో సమంతకు మంచి స్నేహం ఉంది. ఇప్పుడు సిటాడెల్ కి కూడా వీళ్ళే డైరెక్టర్స్. తాజాగా సిటాడెల్ వర్క్ కూడా పూర్తవ్వడంతో రాజ్ అండ్ డీకేలతో దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత.
ఆ ఫోటోని షేర్ చేస్తూ సమంత.. సిటాడెల్ పూర్తయింది. నేను తీసుకోబోయే బ్రేక్ నాకేం తప్పుగా అనిపించట్లేదు ఎందుకంటే రాబోయే మంచి నాకు తెలుసు కాబట్టి. రాజ్ అండ్ డీకే నాకు చాలా కావాల్సిన నా ఫ్యామిలీ లాంటివారు. నా ప్రతి యుద్ధంలోనూ నాకు సపోర్ట్ గా నిలిచినందుకు చాలా థ్యాంక్స్. మిమ్మల్ని నేను ప్రపంచంలో ఎవ్వరూ పొందలేనివిధంగా గర్వపడేలా చేస్తాను. నాకు మంచి రోల్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇంకో బెస్ట్ రోల్ వచ్చేవరకు ఇదే నా బెస్ట్ అని పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.