Sree Vishnu : మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు శ్రీవిష్ణు. ప్రయోగాలు చేసిన సినిమాలు ఫెయిల్ అయితే శ్రీవిష్ణు చేసే కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు మాత్రం సూపర్ హిట్ అవుతున్నాయి, శ్రీవిష్ణు చివరగా రాజ రాజ చోర సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత మూడు సినిమాలు వరుస ఫ్లాప్స్ చూశాయి. ఇప్పుడు సరికొత్త ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ ‘సామజవరగమన’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
‘సామజవరగమన’ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో రెబా మోనికా హీరోయిన్ గా నటిస్తుండగా నరేష్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రామ్ అబ్బరాజు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీవిష్ణు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ డైరెక్టర్స్ పై కామెంట్స్ చేశాడు.
శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో స్టార్స్ ఎక్కువైపోయారు. స్టార్ డైరెక్టర్స్ కి కూడా ఒక్కోసారి స్టార్ హీరోలు దొరకట్లేదు. దర్శకులు తక్కువయ్యారు. అలాంటప్పుడు స్టార్ డైరెక్టర్స్ నా దాకా వచ్చి సినిమా చేయడం కష్టం. నా మార్కెట్ ని కూడా దృష్టిలో పెట్టుకొని సినిమా చేయాలి. అందుకే నా దగ్గరికి వచ్చిన కథల్లోనే మంచివి సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. కొత్త దర్శకుడితో చేయడం కొద్దిగా రిస్క్ అయినా అందులోనే కిక్ ఉంటుంది అని అన్నారు.
అలాగే ఇన్ని సినిమాలు చేసినా స్టార్ డం రాలేదు అనే దానిపై స్పందిస్తూ.. స్టార్ అనేది మన చేతులో లేదు. నటుడు అవ్వడమే చాలా కష్టం. ఇంకా స్టార్ అంటే మరీ కష్టం. ఈ రెండూ ఛాలెంజ్ తో కూడుకున్నవే. నేను యాక్టర్ గా నిరూపించుకోవడానికి ఇష్టపడతాను. నాకు స్టార్ డం లేనందుకు నేను నిరుత్సాహపడను అని అన్నాడు శ్రీవిష్ణు.