Yadamma Raju : పటాస్ అనే కామిడీ షోలో ఒక స్టూడెంట్ గా వచ్చిన రాజు తన మాటలతో, కామెడీతో ఆకట్టుకొని అదే షోలో కమెడియన్ గా యాదమ్మ రాజు అంటూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు టీవీ షోలు, సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం యాదమ్మ రాజు జబర్దస్త్ చేస్తూనే పలు సినిమాల్లో నటిస్తున్నాడు. స్టెల్లా రాజ్ అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. ఇటీవల యాదమ్మ రాజుకి యాక్సిడెంట్ జరిగింది.
ఈ యాక్సిడెంట్ లో కాలికి బాగా దెబ్బ తగలడంతో ఆపరేషన్ చేసినట్టు సమాచారం. యాదమ్మ రాజు హాస్పిటల్ లో ఉన్న ఓ వీడియోని, స్టెల్లా తనకి సపోర్ట్ గా ఉండి నడిపిస్తున్న వీడియోని ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి యాక్సిడెంట్ అయిన విషయాన్ని తెలిపారు. ప్రస్తుతానికి యాదమ్మ రాజు కాలి దెబ్బ తగ్గడానికి కొన్ని నెలలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు సమాచారం.
తాజాగా యాదమ్మ రాజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అసలు తనకి ఎలా యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ గురించి చెప్పాడు. యాదమ్మ రాజు మాట్లాడుతూ.. టీ తాగడానికి బయటకి వెళ్ళాను. ఎదురుగా ఒక బండి స్కిడ్ అయి వచ్చి గుద్దింది. కాలి మీద నుంచి వెళ్లడంతో బాగా ఎఫెక్ట్ అయింది. హాస్పిటల్ కి వెళ్తే కుడి కాలుకు ఉన్న ఒక వేలుని తీసేయాలని చెప్పారు. ఆపరేషన్ చేసి ఒక కాలి వేలుని తీసేశారు. తొడ దగ్గర కొంచెం చర్మం తీసి అక్కడ వేశారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.
ఇటీవలే యాదమ్మ రాజు నటించిన స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా రిలీజ్ అవ్వడంతో కష్టమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టిక్ సాయంతో వచ్చాడు. ఇక కొన్ని ప్రమోషన్స్ ని హాస్పిటల్ బెడ్ మీద నుంచే చేశాడు యాదమ్మ రాజు. ప్రస్తుతం రాజు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. దీంతో రాజు త్వరగా కోరుకోవాలని పలువురు టీవీ ప్రముఖులు, నెటిజన్లు కోరుకుంటున్నారు.