Mahesh Babu : ఆగష్టు 9 అంటే ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లో మహేష్ అభిమానుల సందడి కనిపిస్తుంది. ఒక పక్క గుంటూరు కారం అప్డేట్స్, మరోపక్క ‘బిజినెస్ మెన్’ రీ రిలీజ్ తో థియేటర్స్ లో సందడి. తమ హీరో పుట్టినరోజుని అభిమానులు ఇలా సెలబ్రేట్ చేసుకుంటుంటే, మహేష్ ఫారిన్ లో ఫ్యామిలీతో కలిసి బర్త్ డే వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్, నమ్రతా, గౌతమ్, సితార.. స్కాట్ ల్యాండ్ లో ఉన్నారు.
ఇక అక్కడి ఫోటోలను ఫ్యామిలీ మెంబెర్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మహేష్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే నమ్రతా.. “హ్యాపీ బర్త్ డే MB. ఇప్పటికి ఎప్పటికి నాకు నువ్వు, నువ్వు, నువ్వే” అంటూ రాసుకొస్తూ మహేష్ ని కౌగిలించుకున్న పిక్ ని షేర్ చేసింది. ఇక మహేష్ వారసుడు గౌతమ్ ఫ్యామిలీ మొత్తం ఉన్న పిక్ ని షేర్ చేస్తూ.. “మా ఫ్యామిలీ యొక్క హార్ట్. హ్యాపీ బర్త్ డే నాన్న” అంటూ రాసుకొచ్చాడు. చివరిగా మహేష్ ముద్దుల కూతురు సితార.. “లైఫ్ లోని గొప్ప అడ్వెంచర్స్ ఇద్దరం కలిసి షేర్ చేసుకున్నాము. హ్యాపీ బర్త్ డే నాన్న” అంటూ పేర్కొంది. ఇక వీరు ముగ్గురు షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అలాగే ఇండస్ట్రీలోని ఇతర హీరోలు కూడా మహేష్ కి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక ఈరోజు అర్ధరాత్రి ఒక మాస్ పోస్టర్ ని రిలీజ్ చేసిన గుంటూరు కారం మూవీ టీం.. సాయంత్రం మరో అప్డేట్ ని సిద్ధం చేస్తున్నారు. మరి అది కూడా పోస్టర్? లేదా టీజర్? అనేది వేచి చూడాలి.