Entertainment కోలీవుడ్ అండ్ డైరెక్టర్ అట్లీ శుభవార్త చెప్పేశారు ఆయన సతీమణి నటి ప్రియా తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.. దీంతో ఈ జంటకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు..
యంగ్ డైరెక్టర్ అట్లీ ఆయన సతీమణి ప్రియ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు ఈ విషయాన్ని వీరిద్దరూ స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఫోటోను షేర్ చేసుకున్నారు.. ఈ సందర్భంగా ఆయన చెబుతూ, `మా కుటుంబం పెద్దది కాబోతుంది. ఈ శుభవార్తని మీతో పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. ఇన్ని సంవత్సరాలుగా మీరు మాపై కురిపిస్తున్న ప్రేమ, మద్దతుకు కృతజ్ఞులమై ఉన్నాం. అదే ప్రేమని మా చిన్నారికి కొనసాగించాలని కోరుకుంటున్నాం` అని తెలిపారు అట్లీ. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.. సోషల్ మీడియా వేదికగా అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు..
రాజారాణి చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న అట్లీ తమిళనాడుకు చెందిన వ్యక్తి కాగా ప్రియా వైజాగ్ కు చెందిన అమ్మాయి అయితే సినిమాల్లో నటిస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది దీంతో పెద్దల సమక్షంలో వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు అయితే ఇప్పటికే పలుమార్లు తనకు ఆంధ్రతో ఉన్న అనుబంధం గురించి చెప్పకు వచ్చారు అట్లీ ఇప్పుడు తాజాగా వీరిద్దరూ పేరెంట్స్ గా ప్రమోషన్ తీసుకోబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. కాగా ప్రస్తుతం అట్లీ బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌తో జవాన్ అనే భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.