Director Bapu, Pelli Pusthakam Movie, Heroine Divya Vani, Hero Rajendra Prasad, Mahanati, Srirastu Subhamastu Song, Telugu World Now,
FILM NEWS: టాలీవుడ్ కి మరోసారి “బాపు బొమ్మ”
దర్శకులు బాపు గారు తాను దర్శకత్వం వహించిన సినిమాల్లోని హీరోయిన్లకు హీరోలతో పాటు సమానమైన అవకాశాలు ఇచ్చేవారు. బాపుగారి సినిమాల్లోని ‘పెళ్లి పుస్తకం’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన దివ్వవాణి మాత్రం తెలుగు వారందరికి ఇష్టమైన ముచ్చటైన బాపు బొమ్మ అని చెప్పాలి. కారణం ఏంటంటే బాపు గారు ఎందరో కథానాయికలను తనదైన శైలిలో పరిచయం చేసిన దివ్యవాణికి మాత్రం జీవితకాలం ప్రేక్షకుల మనసుల్లో తిష్ఠ వేసుకునే పాత్రను ఇచ్చారు.
ఆమె నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌తో అనేక చిత్రాల్లో నటించినప్పటికి ‘పెళ్లిపుస్తకం’ లోని సత్యభామ పాత్ర మాత్రం ప్రత్యేకం. తెలుగు వారిళ్లలో పెళ్లి జరిగిందంటే అందరి లోగిళ్లలో వినిపించే పాట ‘‘శ్రీరస్తు శుభమస్తు’’. ఆ పాట హమ్ చేసి చేయగానే ఒక్కసారిగా మన మనసుల్లోకి దివ్యవాణి, రాజేంద్రప్రసాద్ వచ్చివెళ్తారు. ముచ్చటైన జంటకు సాక్షంగా వారివురి పాటని వినని పెళ్లిపందిరి లేదంటే అతిశయోక్తి కాదేమో. 90వ దశకంలో జరిగిన పెళ్లి వీడియో క్యాసెట్లలో ఈ పాట లేకుండా పెళ్లి వీడియో ఉండేది కాదు. ఆ సినిమా వచ్చి ఇప్పటికి 30 ఏళ్లయినా విన్న ప్రతిసారి, చూసిన ప్రతిసారి దివ్యవాణి నటిగా ఎంత గ్రేట్ ఆర్టిస్టో అని తప్పకుండా పొగుడుతాం. అలాగే తన కెరీర్‌లో ఎంతో మంది గొప్ప దర్శకులతో, హీరోలతో పనిచేసింది.
అమె నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చక్కని విజయాలు నమోదు చేసుకున్నాయి. చాలాకాలం గ్యాప్ తర్వాత మళ్లీ బాపు గారే ‘‘రాధాగోపాలం’’ చిత్రంలో క్యారెక్టర్ నటిగా అవకాశం ఇచ్చారు. 2018లో వచ్చి సంచలన విజయం సాధించిన ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రకు అమ్మగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. జూలై 4.వ తేది ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె మళ్లీ తనకు అవకాశం ఇస్తే చక్కని పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులందరి మనసుల్లో చిరస్థాయిగా నిలవాలని ఉందని కోరుకుంటున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ టు దివ్యవాణి…..
