క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో ఆకట్టుకున్న దర్శకుడు కె దశరథ్ అందిస్తున్న కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ యూ రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరధ్ కలిసి మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ , థీమ్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ లాంచ్ చేశారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సాంగ్ టీజర్ ని విడుదల చేశారు.
లీడ్ పెయిర్, వారి భిన్నమైన పాత్రలను పరిచయం చేయడం ద్వారా సినిమా బేసిక్ ప్లాట్ లైన్ ని ఆసక్తికంరగా రివిల్ చేశారు. లీడ్ పెయిర్ చిన్నప్పటి నుండి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అబ్బాయే తనకు సర్వస్వం అని అమ్మాయి భావిస్తుంది. కానీ అతని అసలు క్యారెక్టర్ గురించి తెలుసుకున్నప్పుడు ఆమె మోసపోయినట్లు భావిస్తుంది. భిన్నమైన మనస్తత్వం ఉన్న ఇద్దరి ప్రేమకథ ఎక్కడ ముగుస్తుందో కథలో కీలకాంశం.
లవ్‌స్టోరీతో పాటు సినిమాలోని ఎమోషనల్ పార్ట్‌ను కూడా టీజర్‌లో చూపించారు. లవ్ యు రామ్ దశరధ్ మార్క్ రొమాంటిక్ , ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని టీజర్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. రోహిత్ బెహల్ ట్రెండీగా కనిపించారు. అపర్ణ జనార్దనన్ యాప్ట్ ఛాయిస్. డివై చౌదరి సబ్జెక్ట్ ని చాలా కన్విన్సింగ్‌గా డీల్ చేసారని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. సినిమాటోగ్రాఫర్ సాయి సంతోష్ , సంగీత దర్శకుడు కె వేద బ్రిలియంట్ వర్క్ చేశారు. ఈ చిత్రానికి ఎస్‌బి ఉద్ధవ్ ఎడిటర్, గురు మురళీకృష్ణ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ… దశరధ్, డివై చౌదరి గారి నా బెస్ట్ విశేష్. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. రోహిత్ నాట్యం సినిమా చూశాను. అతనిలో చాలా మంచి డ్యాన్సర్, యాక్టర్ వున్నారు. లవ్ యూ రామ్ సినిమా అతనికి మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను. అలాగే అపర్ణాకి కూడా ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో పాటలు కూడా అద్భుతంగా వున్నాయి. దశరధ్ గారు అద్భుతమైన చిత్రాలు అందించిన దర్శకుడు. నిర్మాత కూడా మంచి సక్సెస్ సాధించాలని కోరుతున్నాను. సినిమా మంచి విజయం సాధించి సినిమాలో పని చేసినందరికీ మంచి పేరు రావాలి” అని కోరారు.