Director Sukumar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్‌గా సుకుమార్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. సుకుమార్ క్రియేటివిటికి చాలా మంది అభిమానులు ఉంటారు. హిట్ ఫ్లాఫ్‌లతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేస్తాయి. అయితే తాజాగా సుకుమార్ తన పెద్ద మనసును చాటుకున్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి చికిత్స కోసం తన వంతు సాయం అందించారని తెలుస్తుంది.
వివరాల్లోకి వెళితే… అంబేద్కర్ కోనసీమ జిల్లా జనుపల్లెకు చెందిన ఆనంద్ గత కొంత కాలంగా కాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతని స్నేహితులు ఆనంద్ చికిత్స కోసం డబ్బులు ఎవరైనా సాయం చేయగలరంటూ ఫేస్‌బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. దీనిని చూసిన డైరెక్టర్ సుకుమార్ అతనికి రూ.50వేల ఆర్థిక కసాయం చేశారు. సినిమాల్లోనే కాదు సేవా కార్యక్రమాల్లోనూ తనవంతు పాత్ర పోషించడం పట్ల పలువురు అభినందిస్తున్నారు. గతం లోనూ సుకుమార్ పలు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.
తన స్వస్థలం మట్టపర్రు గ్రామంలో తన సొంత నిధులతో పాఠశాలను ఏర్పాటు చేశాడు. చుట్టు పక్కల గ్రామాల్లోనూ తన తండ్రి పేరుతో పలు స్కూల్స్, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక కరోనా కాలం లోనూ రూ.లక్షలు ఖర్చు చేసి బాధితులకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, ఆహార సదుపాయాలు సమకూర్చారు. ఇక సుకుమార్ సినిమాల విషయాని కొస్తే… అల్లు అర్జున్ తో తెరకెక్కించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సుకుమార్ గుర్తింపు పొందారు. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినికాకి సీక్వెల్ గా పుష్ప 2 ను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.