Entertainment : మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో దాదాపు 12 ఏళ్ల తర్వాత మరో సినిమా రాబోతుంది అయితే ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు అయితే తమన్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఎప్పుడూ సూపర్ హిట్ గానే ఉంటుంది ఇది ఎలా సాధ్యమని ప్రేక్షకులంతా ఆశ్చర్యపోతుంటారు..
అయితే గత ఏడాది వచ్చిన బాలకృష్ణ అఖండ మూవీ ఎంత హిట్ అయిందో తెలిసిందే.. ఇంత సంచలన విజయం సాధించిన ‘అఖండ’కు తమన్ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన హైలైట్ గా నిలిచింది. ఆ తరువాత డీజే టిల్లు, భీమ్లానాయక్ సినిమాలకు తమన్ ఆకట్టుకునే నేపథ్య సంగీతాన్ని అందించాడు. కానీ రాధేశ్యామ్, థాంక్యూ గాడ్ ఫాదర్ కు ఆశించిన స్థాయిలో సంగీతం అందించక ప్రేక్షకులను నిరాశపరిచాడు తమన్. అయితే తాజాగా త్రివిక్రమ్ మహేష్ ల మూవీ ఆరంభ వీడియోకు బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టడంతో అంతా త్రివిక్రమ్ తమన్ లకే ఇది ఎలా సాధ్యమవుతోంది? తమన్ నుంచి ఇంత మంచి సంగీతాన్ని త్రివిక్రమ్ ఎలా రాబట్టగలుగుతున్నాడు? అని ఇండస్ట్రీ వర్గాలు వాపోతున్నాయట.
తమన్ కు త్రివిక్రమ్ ఇచ్చే ఫ్రీడమ్ ని బట్టే అతని నుంచి అబ్బురపరిచే ట్యూన్ లు వస్తున్నాయనే తెలుస్తుంది. అలా వచ్చిందే ‘అల వైకుంఠపురములో’ ఆల్బమ్ అని అంటున్నారు. ఈ సినిమాలో కూడా తమన్ సంగీతం అదరగొట్టేసాడు..






















