Balakrishna in Jailer : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’ సినిమా ఆగస్టు 10న గ్రాండ్ గా రిలీజయి భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో తమన్నా , కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ , మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, సునీల్.. లాంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటించారు.
ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీ నుంచి శివరాజ్ కుమార్, మలయాళ ఇండస్ట్రీ నుంచి మోహన్ లాల్ లని తీసుకొచ్చి గెస్ట్ అప్పీరెన్స్ ఇప్పించి వాళ్ళకి రజినీకాంత్ కి సమానంగా ఎలివేషన్స్ ఇచ్చారు. సినిమా చివర్లో ముగ్గురు మూడు ప్లేస్ లలో ఉండి వాళ్లకి ఎలివేషన్స్ ఇచ్చిన తీరు అదిరిపోయి సినిమాకే హైలేట్ గా నిలిచింది. అలాంటి ఎలివేషన్స్ కి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవ్వర్నీ తీసుకోలేదు.
జైలర్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో డైరెక్టర్ నెల్సన్ ఇంటర్వ్యూలు ఇస్తుండగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్ నుంచి కూడా ఓ స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ అనుకున్నాను. బాలకృష్ణ గారిని జైలర్ సినిమాలో పెడదామనుకున్నాను. ఆయన క్యారెక్టర్ కూడా ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో రాసుకున్నాను కానీ అది ఎందుకో ఆయన రేంజ్ కి తగ్గ పాత్ర కాదు అనిపించింది. బాలకృష్ణ గారికి ఇంకా పవర్ ఫుల్ గా ఉండాలి అనిపించి వదిలేశాను అని తెలిపాడు. ఈ విషయం తెలిసి బాలయ్య అభిమానులతో పాటు తెలుగు ఆడియన్స్ కూడా నిరాశ చెందుతున్నారు.
బాలకృష్ణని కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇప్పించి ఎలివేషన్స్ ఇస్తే తెలుగు థియేటర్స్ దద్దరిల్లిపోయేవి. కలెక్షన్స్ ఇంకా ఎక్కువ వచ్చేవి అని నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే సినిమాలో ఓ చోట రాయలసీమలో బాంబు వేసే సీన్ ఉంటుంది అక్కడ కనీసం ఒక నిమిషం అయినా బాలకృష్ణని ఆయనకి కలిసొచ్చిన ఫ్యాక్షన్ సీక్వెన్స్ లో పెట్టి ఉంటే బాగుండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మన బాలయ్యకి ఒక మంచి పవర్ ఫుల్ పాత్రని మిస్ అయ్యాం అని ఫీల్ అవుతున్నారు తెలుగు ఆడియన్స్.