కాదంబరి కిరణ్ ఫౌండేషన్ ‘మనంసైతం’ ఆధ్వర్యంలో దిల్ రాజు చేతుల మీదుగా అవసరార్ధులకు చెక్కుల పంపిణి
పేదవారికి సాయం పడాలన్న సంకల్పం.. నిస్సాహయకులకు అండగా నిలబడాలన్న మానవత్వం.. మొత్తంగా సమాజంలో అందరూ బాగుండాలనే లక్ష్యం.. వీటన్నింటికి ప్రతిరూపమే.. ‘మనం సైతం’. గడిచిన పది సంవత్సరాల కాలంలో ఎంతో మందికి సాయం చేస్తోంది కాదంబరి కిరణ్ నిర్వహణలోని ‘మనం సైతం’ ఫౌండేషన్. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ ఫౌండేషన్ సారధ్యంలో ఆరుగురికి నిర్మాత దిల్ రాజు, దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా చెక్కులు పంపిణి చేశారు. తమ సాయం నిరంతరంగా కొనసాగుతూనే వుంటుందని తెలిపారు.
ఫిల్మ్ చాంబర్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్ మాట్లాడుతూ… ‘మనం సైతం’ ఫౌండేషన్ ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు అండగా ఉంటున్న కళామాతల్లి ముద్దుబిడ్డలైన ప్రతిఒక్కరికి పాదాబివందనం. గడిచిన పది సంవత్సరాల కాలంలో పేదలైన సినీ కార్మికులకు కోటి రూపాయాలకు పైగా సహాయం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి , ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారికి కృతజ్ఙతలు తెలిపారు.
గడిచిన పది సంవత్సరాల కాలం నుంచి తెలుగు రాష్ట్రాలలో ఉన్న పేదల నుంచి విజ్ఞప్తులు అందుతుండటంతో సాధ్యమైనంత సహాయం చేస్తున్నాం, అంతేకాకుండా ప్రకృతి వైపరిత్యాలైన తిత్లీ తూఫాన్, కర్నూలు వరదలు, కేరళ వరదల సమయంలో అందరి సహాకారంతో సహాయం చేశాము. వందలాది మంది సాయం కోసం ఎదురుచూపు..కానీ ‘మనం సైతం’ సేవలు తీసుకునే వారికి తొందరగా చేరుకున్నా.. దాతల దగ్గరికి అంత తొందరగా చేరడం లేదని నా భావన.. ఇది తెలుసుకున్న ఇండస్ట్రీ పెద్దలు ప్రసన్న కుమార్ గారు, చదలవాడ శ్రీనివాసరావు గారు, దాము గారు, వివి వినాయక్ గారు, జయసుధ గారు తమ సహాకారం ఉంటుందని ప్రోత్సాహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా వచ్చిన దిల్ రాజు, దాము, ప్రసన్న కుమార్ పలువురు ప్రముఖుల చేతుల మీదుగా అవసరార్ధులకు రూ. 25 వేలు చొప్పన చెక్కుల పంపిణి అందజేయడం ఆనందగా ఉంది” అని అన్నారు.
ముఖ్య అతిథి దిల్ రాజు మాట్లాడుతూ.. ”దేవుడు ఉన్నాడా..? లేడా.? చర్చ రెగ్యూలర్ గా వింటూ ఉంటాం.. అది మనుషులకైతే తెలియదు.. నమ్మేవాళ్లు నమ్ముతారు… నమ్మని వాళ్లు నమ్మరు. దేవుడు మనిషి పుట్టించాడు… ఆ మనిషి ద్వారా ఎదుటి మనిషికి సాయం పొందినప్పుడే దేవుడున్నాడని నమ్ముతుంటారు.. ‘మనం సైతం’ సేవ కార్యక్రమాలు చూస్తుంటే దేవుడికి, మనిషికి కాదంబరి కిరణ్ ఓ వారధి, ఇలాంటి చూసినప్పుడు దేవుడు ఉన్నాడని బలంగా అనిపిస్తుంది. సినీ ఇండస్ట్రీలో పెద్దలు, స్నేహితుల సహాకారంతో ఇప్పటివరకు చాలా సేవలు చేశారు. మీ చివరి శ్వాస వరకు ఈ సేవలు కొనసాగించండి.. మీ వెనుక మేము ఉంటాం. దైవం మానవ రూపంలో అవతరించు నీలోకంలో.. అదే కాదంబరి కిరణ్” అన్నారు.
- సీనియర్ సినీ ప్రొడక్షన్ మేనేజర్ బీవీ రామకృష్ణ(కార్డ్ నె.458)గారి పాప BLS లక్ష్మి B.tech 2వ సం.ఫీజు కొరకు రూ 25,000
- సినీ ప్రొడక్షన్ మేనేజర్ గానే కాక పలు శాఖలలో సేవలు చేసిన రసపుత్ర దిలీప్ సింగ్ కాన్సర్ తో బాధపడుతూంటే ఆసుపత్రి ఫీజులకై రూ.25,000
- గుంటూరు కి చెందిన వై.రవికుమార్( పూర్తిగా అంధుడు అయిపోవటం వలన తన ఉద్యోగం పోగా,తన 7 నెలల పాపకు వైద్యం కోసం రూ.25,000 +దారి ఖర్చులకి 1000/-=26000
- దర్శక సంఘం సభ్యుడు కొమ్ము ప్రభాకర్ (కార్డు 1367) బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూంటే చికిత్స కొరకు రూ.25,000
- అంబడిపూడి హరీష్ కార్తికేయ బీటెక్ 4వ సం.ఫీజు కొరకు( 2వ సం 30,000/-,3వ సం. 30,000/-ఫీజులకొరకు Usa పసుమర్తి కృష్ణ గారి ద్వారా 9 త్రెడ్స్ నుంచి సాయం అందించాం) రూ.25,000/- మనం సైతం కుటుంబం నుంచి సర్వశ్రీ.దిల్ రాజు, దాము,ప్రసన్న,రామసత్యనారాయణ వంటి పెద్దల చేతులపై సాయం చేసాం బాస్! కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయం కోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా.. మనం సైతం