ఇప్పుడంటే కాలం మారిపోయింది కాబట్టి గానీ, కొంతకాలం క్రితం వరకూ చాలా ఎక్కువమందికి ఉదయాన్నే న్యూస్ పేపర్ చదవడం ఒక హాబీగా వుండేది. ఎప్పుడైనా ఒక్కరోజు న్యూస్ పేపర్ చదవలేకపోతే ఆరోజంతా ఏదో కోల్పోయినట్టుగా వుంటుంది. అయితే, ఇప్పటికీ న్యూస్ పేపర్ ని రెగ్యులర్ గా చదివేవాళ్లు అక్కడక్కడైనా వుంటారు.
అయితే, ఏ వార్తా పత్రికలను గమనించినా చివర్లో నాలుగు రంగులు కనిపిస్తుంటాయి. ప్రతీ పేజీలో ఈ రంగులు తప్పనిసరిగా ఉంటాయి. పేపర్‌లో కింద ఉండే నాలుగు రంగులు CMYK. C for సియాన్ అంటే నీలం, M for మెజెంటా అంటే గులాబీ, Y for యెల్లో, K for బ్లాక్ అంటే నలుపు రంగులకు అవి సూచికలు. ఈ నాలుగింటినీ ప్రింటింగ్ పరిభాషలో ప్రాథమిక రంగులుగా వ్యవహరిస్తారు.
ఈ కలర్స్ కాంబినేషన్ ఆధారంగానే మనకు కావలసిన కొత్త రంగు వస్తుంది. ఇక పేపర్ ప్రింట్ చేసే సమయంలో ఈ నాలుగు రంగులకు సంబంధించిన ప్లేట్స్‌ని అమరుస్తారు. ఈ ప్లేట్స్ కేటాయించిన స్థలం నుండి పక్కకు జరిగితే ప్రింటింగ్‌లో అక్షరాలు, ఫొటోలు సరిగ్గా ప్రింట్ అవ్వవు. అయితే, ప్రింటింగ్ అవుతున్న ప్రతీ పేపర్‌ను ఓపెన్ చేసిన సరిగ్గా ప్రింట్ అవుతుందో లేదో చూడలేరు కాబట్టి పేపర్‌కి చివర్లో ఉండే ఈ నాలుగు రంగులను అక్కడక్కడ చెక్ చేస్తుంటారు.
ఒకవేళ ఈ నాలుగు రంగులు సరిగ్గా ప్రింట్ కాకుండా ఏమైనా బ్లర్ వస్తే వెంటనే అలర్ట్ అయి సదరు కలర్ ప్లేట్స్‌ను సెట్ చేసి మళ్లీ ప్రింటింగ్ ప్రారంభిస్తారు. ఇదన్నమాట ఆ నాలుగు రంగుల కథ.
https://www.youtube.com/watch?v=L0bnz_ljm98&pp=ygUQdGVsdWd1IGdvbGRlbiB0dg%3D%3D