Pomegranate: మనం రోజు తినే దానిమ్మ తొక్కతో చాలా లాభాలు ఉన్నాయి. దీనిలో సన్ స్క్రీన్ లోషన్ వంటి గుణం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ దానిమ్మ తొక్కను సరైన రీతిలో ఉపయోగించుకుంటే సూర్య కిరణాల నుంచి వచ్చే హానికరమైన యూవీ కిరణాలు మనిషిని తాకవని చెప్తున్నారు. దీనిని సరైన రీతిలో ఉపయోగించుకుంటే మీ చర్మానికి దానిమ్మ తొక్కు రక్షణగా నిలుస్తుందని అంటున్నారు. అయితే ఇందుకు గానూ దానిమ్మ తొక్కను ఎండబెట్టి పొడి చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే అనంతంర దానిని రోజ్ వాటర్ కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్‌లా అప్లై చేసుకోవాలంట. అయితే ఇలా చేయడం ద్వారా మన చర్మానికి నిగారింపు వచ్చి ప్రకాశవంతంగా వెలుగుతుందని చెప్తునారు.
ఇదిలా ఉంటే దానిమ్మ తొక్కలకు మొటిమలను పోగొట్టే గుణం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు. తినేసిన తరువాత దానిమ్మ తొక్కలను పడేయకుండా పక్కన పెట్టుకుని దానిని మెత్తగా పొడిగా మార్చుకోవాలి. అనంతరం ప్రతీ రెండు రోజులకో సారి నీళ్లలో కలిపి మొత్తగా పేస్టులా చేసి ముఖానికి రాసుకొచ్చని చెప్తున్నారు.
ఇలా చేసిన సుమారు అరగంట తరువాత నార్మల్ గానే ఇక ఫేస్ వాష్ చేసుకుంటే మొటిమల నుంచి కూడా ముఖాన్ని రక్షించుకోవచ్చు అని చెప్తున్నారు. అంతేగాక దానిమ్మ తొక్కతో నోటి పరిశుభ్రతను కాపాడుకోవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. ఈ దానిమ్మ తొక్కకు ఇలాంటి లక్షణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. దానిమ్మ తొక్కు పొడిని నీటిలో కలిపి పుక్కిలించి ఊయడం ద్వారా నోటి నుంచి దుర్వాసన పోతుందని అభువజ్ఞులు చెప్తున్నారు.