Dr.Bachampalli Santhosh Kumar Shastry Gari Sri Plava Nama Samvatsara Ugadi Panchangam Sravanam
రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ ప్లవ నామ ఉగాది శుభాకాంక్షలు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
యాదాద్రి శ్రీలక్ష్మినర్సింహా స్వామి దేవాస్థాన శ్రీ ప్లవ నామ ఉగాది పంచాంగాన్ని ప్రభుత్వ సలహాదారు రమణాచారి తో కలిసి ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు వేణుగోపాల చారి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, రీజినల్ జాయింట్ కమిషనర్ క్రిష్ణవేణి, తదితరులు
బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రిచే పంచాంగ పఠనం
బాచంపల్లి సంతోష్ కుమార్ చే ఉగాది పంచాంగ పఠనం
* చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణమే శ్రీ ప్లవ నామ సంవత్సరం
*ధన ధాన్యాలు కలుగుతాయి
*వర్షాలు సమృద్దిగా కురుస్తాయి. శుభ ఫలితాలు కలుగుతాయి
*సుఖ, సంతోషాలు కలుగుతాయి
*ప్రభుత్వ రంగాలు, బ్యాంకింగ్ రంగం పురోగతిలో ఉంటాయి
*విద్య సంస్థలకు వృద్ది ఉంటుంది.
*పోలీస్ శాఖ పనితీరు సమర్థవంతంగా ఉంటుంది
*ప్రభుత్వము, దేవాలయాల ఆదాయం వృద్ధిలో ఉంటుంది.
*పాలన పరమైన దుభార, ప్రజల ఆడంబరాలకు ఖర్చు పెరుగుతుంది.
*కరోనా బారి నుంచి బయట పడుతాము
*ప్రజలకు భయం అతివృష్టి తప్పకపోవచ్చు
*రైతులకు శుభప్రదంగా ఉంటుంది. ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ వర్షాలు భాగానే కురుస్తాయి.
*వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు రైతులు పంటలు వేయాలి
*కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబంధాలు బాగుంటాయి
*అన్నింటా స్త్రీల ఆధిపత్యం, విజయాలు చేకూరుతాయి
*ఇంకా భయం తొలగిపోలేదు. ఆరోగ్యం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ముప్పు తప్పదు
*రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ది వుంటుంది
*భూముల కుంభకోణాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రజలు భూముల క్రయవిక్రయాల్లో జాగ్రత్త ఉండాలి.
*ఈ సంవత్సరం మంచి ముహూర్తాలు ఉంటాయి.