గౌరవనీయులైన పత్రికా ప్రతినిధులకు / స్టాఫ్ రిపోర్టర్లకు నమస్కారములు….
ఈ నెల 27న 4వ వార్షికోత్సవం సందర్భంగా పద్మ విభూషణ్ డాక్టర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి హృదయాంజలి ఘటిస్తున్నాయి. ఆ రోజున సాయంత్రం 3.45 గంటల నుండి 7 గంటల పాటు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు శ్రీమాధవపెద్ది సురేష్ చంద్రగారి ఆధ్వర్యంలో 60 మందికి పైగా నేపథ్య గాయనీ గాయకులు మరియు 20 మంది ప్రఖ్యాత వాయిద్య కళాకారులు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి అంజలి ఘటిస్తారు. ఈ హృదయాంజలి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది. ముఖ్యంగా ప్రవాస తెలుగు సంఘాలైన ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్, తానా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ రీడింగ్ అండ్ ఎరౌండ్ (తార), బర్మింగ్‌హమ్ తెలుగు అసోసియేషన్ (బీటీఏ), సిలికాన్ ఆంధ్రతో పాటు న్యూజిలాండ్, ఒమన్, బహ్రెయిన్, కువైట్, సింగపూర్ తదితర దేశాల్లోని మరెన్నో సంఘాలు ఈ కార్యక్రమానికి తమ సహకారాన్ని అందిస్తున్నాయి.
మీరు ఈ కార్యక్రమం గురించి మీ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాము