Health ఈరోజుల్లో చాలామంది మహిళలు గర్భధారణను అప్పుడే వద్దనుకుంటూ నిరోధక మాత్రలను ఎక్కువగా తీసుకుంటున్నారు అయితే దీనివల్ల ముందు ముందు ముప్పు తప్పదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..
గర్భనిరోధక మాత్రలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మహిళల ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తున్నాయి అంతేకాకుండా భవిష్యత్తులో వాళ్ళు ఎన్నో మానసిక సమస్యలను ఎదుర్కోవటానికి కారణం అవుతున్నాయి ముఖ్యంగా వీటివలన శరీరం హార్మోన్ల సమతుల్యతను కోల్పోతుంది ఇందువలన ఈ మాత్రలు వారి మానసిక స్థితి పైన నేరుగా ప్రభావం చూపిస్తున్నాయి..
అంతేకాకుండా ఈ మాత్రం ఎక్కువగా తీసుకుంటే అది నేరుగా హైపోథాలమస్ గ్రంధి పైన దాని ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ మాత్రలు క్రమం తప్పకుండా తీసుకునే స్త్రీలలో వారి హైపోథాలమస్ పరిమాణం తగ్గిపోతుంది.. ఇది శరీర ఉష్ణోగ్రత, ఆకలి, మానసిక స్థితి, సెక్స్ డ్రైవ్‌ను నియంత్రించే మెదడులోని భాగం. సరిగా ఆకలి వేయకపోవడం, ఏ పని పైన ఇంట్రెస్ట్ ఉండకపోవటం వంటి సమస్యలు తలెత్తుతాయి.. అంతే కాదు, నిద్రను సమతుల్యం చేయడంలో హైపోథాలమస్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మరి అలాంటి గ్రంధి పైన ప్రభావం చూపిస్తే తప్పకుండా ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది.. అంతేకాకుండా సరిగా నిద్ర లేకపోవడం, ఆకలి వేయకపోవడం వంటి సమస్యలు కూడా వేధిస్తాయి.. వీటిని ఎక్కువగా వాడితే జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది.. అలాగే వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు దీర్ఘకాలంగా మరిన్ని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. అంతేకాకుండా భవిష్యత్తులో పిల్లలు పుట్టడానికి కూడా ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి..